Brahmamudi February 12th Episode Highlights: ఓర్నీ..నందగోపాల్ బతికే ఉన్నాడు .. రంగంలోకి దిగిన అప్పూ - బ్రహ్మముడి ఫిబ్రవరి 12 ఎపిసోడ్ హైలెట్స్!
నేను మా అన్నయ్య బాటలో నడిచాను..నువ్వు కూడా అదే చేస్తున్నావు.. కానీ ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే తప్పు చేశాను అనిపిస్తోంది. నువ్వు ఓసారి ఆలోచించు అని కళ్యాణ్ కి చెబుతాడు తండ్రి ప్రకాశం
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్వప్న దగ్గరకు వెళ్లిన రుద్రాణి-రాహుల్.. మళ్లీ డబ్బుల గురించి కావ్యపై నూరిపోస్తారు. స్వప్న కూడా ఆలోచనలో పడుతుంది
హాస్పిటల్ కి వచ్చిన భార్య ఇందిరాదేవిని చూసి ఏమైంది చిట్టీ అని అడుగుతాడు సీతారామయ్య. ధాన్యం చేస్తున్న రచ్చగురించి చెబుతుంది. రాజ్ వందకోట్లు అప్పుచేసినట్టు ఆధారాలు ఉన్నాయా అంటే లేవంటుంది. సీతారామయ్య ఆలోచనలో పడతాడు
దయానంద్ అనే పోలీస్...స్టేషన్లో ఇద్దర్ని బెదిరిస్తుంటాడు ఆ దొంగతనం ఎవరు చేశారో చెప్పండి అని. వాస్తవానికి దయానంద్ రాజ్ కి వందకోట్ల వ్యవహారంలో సహాయం చేస్తున్నట్టు చూపించారు. దొంగతనం ఎవరు చేశారో చెప్పండి అంటూ చితక్కొడుతుంటే ఎంట్రీ ఇస్తుంది అప్పు
ఇక్కడేం జరుగుతోంది అంటే..దయానంద్ కంగారుగా సెల్యూట్ చేసి టెంపుల్ లో నగలు పోయాయ్ వీళ్లని విచారణ చేస్తున్నా అంటాడు. మాకేం తెలియదు మేడం అని ఇద్దరూ చెబుతారు. అప్పూ వాళ్లనుంచి నిజం రాబడుతుంది. ‘మీరు చాలా టాలెంటెండ్ మేడమ్ అంటూ అప్పూని పొగిడేస్తాడు.
దుగ్గిరాల ఇంటికి బ్యాంక్ వాళ్లు ఎంట్రీ ఇస్తారు. గడువులోపు డబ్బు చెల్లించలేదు కాబట్టి జప్తు చేస్తాం అనడంతో ఇంట్లో గొడవ మెదలవుతుంది. ధాన్యం, రుద్రాణి చెలరేగిపోతారు.
ఇక ఆ పండి అంటూ సుభాష్ ఎంట్రీ ఇస్తాడు. మా నాన్న ష్యూరిటీ సైన్ చేశారంటూ అసలు నిజం బయటపెడతాడు. మాకు ఆస్తి ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అని గొడవ మరింత పెద్దది చేస్తారు. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు సీతారామయ్య
బ్రహ్మముడి ఫిబ్రవరి 13 ఎపిసోడ్ లో... మన స్టాల్ రెడీ అయింది చూడండి అని ఓ వీడియో పంపిస్తుంది ఆఫీసులో రాజ్ అసిస్టెంట్. ఆ వీడియోలో నందగోపాల్ కనిపించడంతో షాక్ అవుతారు రాజ్ కావ్య. ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారం చేశారని ఫిక్సవుతారు