Brahmamudi December 28th Episode: దొరికిపోయి కవర్ చేసిన రాజ్ కళావతి.. మొత్తం కనిపెట్టేసిన ఇందిరాదేవి - బ్రహ్మముడి డిసెంబరు 28 ఎపిసోడ్ హైలెట్స్!
కావ్య గురించి నిలదీయండి అంటూ ప్రకాశాన్ని బలవంతంగా కిందకు తీసుకొచ్చి అపర్ణ-సుభాష్ దగ్గరకు పంపిస్తుంది ధాన్యలక్ష్మి. భయంభయంగా వెళ్లిన ప్రకాశం..కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయమని కావ్యకు చెప్పు అన్నయ్యా అంటాడు.. సరే అంటాడు సుభాష్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహాస్పిటల్ బిల్ క్లియర్ చేయలేదని సుభాష్ కి కాల్ వస్తుంది. ఇదే అవకాశంగా రుద్రాణి, ధాన్యలక్ష్మి నోటికి పనిచేస్తారు. కావ్య సైలెంట్ గా నిల్చుంటుంది..రాజ్ ఇదంతా చూస్తుంటాడు. అసలు విషయం బయటపడేలా ఉంది ఏదైనా చేయాలి అనుకుంటూ రాజ్ కిందకు వస్తూ నేను చెప్తాను అంటాడు
ఇంతకీ నీ బాధ ఏంటి అత్తయ్యా అన్న రాజ్ తో.. హాస్పిటల్ బిల్ కట్టలేదని కాల్ వచ్చిందంటుంది రుద్రాణి. ఎందుకు క్లియర్ చేయలేదని అపర్ణ కూడా క్వశ్చన్ చేస్తుంది. ఇందిరాదేవి కూడా అడగడంతో ఇదంతా నావల్లే జరిగిందంటాడు రాజ్.
చెప్పండి మీరే చెప్పండి.. అంతా నన్నే దోషిగా నిలబెట్టినా మౌనంగా ఉన్నాను..కానీ మిమ్మల్ని అంటుంటే ఆగలేక నేనే చెప్పాలనుకున్నా అంటుంది. అసలేం జరుగుతోంది ఇద్దరూ కలసి ఏం చేస్తున్నారని సుభాష్ అంటాడు..ఇద్దరూ ఏదో పెద్ద విషయమే దాస్తున్నారని అనుమానిస్తారు. ఇందులో దాచేందుకు ఏం లేదు ఆఫీసులో ఆడిటింగ్ జరుగుతోంది అందుకే ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయ్ అంటాడు.
ఆడిటింగ్ మార్చిలో కదా జరగాలని ప్రకాశం అడిగితే ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నావ్ శభాష్ అన్నయ్యా అంటుంది రుద్రాణి. ఇప్పుడు ఆడిటింగ్ ఏంటో చెప్పు రాజ్ అని రుద్రాణి అంటే దానికి నా కారణం నీ కొడుకే..చుట్టూ తిరిగి నా మెడకు చుట్టుకుందని రివర్స్ అవుతాడు రాజ్.
తాతయ్య ట్రీట్మెంట్ కన్నా నీ భార్యను వెనుకేసుకు రావడమే ఎక్కువైందంటుంది రుద్రాణి. ఏదైనా అడిగే ముందు నిలదీసే ముందు క్లారిటీగా తెలుసుకోవాలని రుద్రాకి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు
మౌనంగా వెళ్లి గార్డెన్లో కూర్చున్న ఇందిరాదేవి దగ్గరకు వెళ్లి మాట్లాడొచ్చా అమ్మమ్మా అంటుంది. సొంతవాళ్ల దగ్గర అనుమతులు తీసుకోవడం ఎప్పుడు మొదలుపెట్టావ్ అంటుంది. తాతయ్య ట్రీట్మెంట్ బిల్లు కట్టలేదని మీకు కోపం వచ్చిందా? కొట్టండి, తిట్టండి..కానీ నాతో మాట్లాడండి అంటుంది. నిన్ను పూర్తిగా నమ్ముతున్నా అంటుంది ఇందిరాదేవి
సుభాష్ వెళ్లి కంపెనీలో ఏదైనా ప్రాబ్లెమ్ ఉందా అని అడిగితే ఏం లేదు అంటాడు రాజ్. సరే జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతాడు
ఏదో జరుగుతోంది...రాజ్ ప్రవర్తన చూస్తుంటే తేడాగే ఉందని రుద్రాణి,ధాన్యలక్ష్మి ఆలోచిస్తుంటారు..
బ్రహ్మముడి డిసెంబర్ 29 ఎపిసోడ్ లో... కార్లు అన్నీ ఓ డ్రైవర్ ని పిలిచి పంపించేస్తుంది కావ్య.. ఈ కార్ల వ్యవహారం అందరకీ చెప్పి రచ్చ చేయాలని డిసైడ్ అవుతారు రుద్రాణి-రాహుల్...