Brahmamudi December 26th Episode: నిజం బయపెట్టాల్సిన అవసరం రావడంతో నీళ్లు నములుతున్న రాజ్ కావ్య - బ్రహ్మముడి డిసెంబరు 26 ఎపిసోడ్ హైలెట్స్!

ఆకలికి తట్టుకోలేక శాంతను వడ్డించమని అంటారు రుద్రాణి, ధాన్యలక్ష్మీ..కానీ అప్పటికే ముష్టివాళ్లకు వేసేశానంటుంది. కావ్య మేడమ్ తో చెప్పించండి అంటుంది శాంత..ఫైర్ అవుతారు రుద్రాణి, ధాన్యం. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన స్వప్న..తన నెక్లెస్, చెవి కమ్మలు చూపిస్తుంది. వీటి ధర పది లక్షలు అని చెబుతుంది..
Download ABP Live App and Watch All Latest Videos
View In App
అంత డబ్బు ఎక్కడిది అంటే..కావ్య ఇచ్చిందంటుంది. ధాన్యలక్ష్మి, రుద్రాణి షాక్ అవుతారు. మీ మొహం చూస్తే ఇవ్వాలి అనిపించదు.. నా బోసి మెడ చూడలేక నా చెల్లి ఇచ్చింది అంటుంది.

వెంటనే ధాన్యలక్ష్మి అక్కా అని అరుచుకుంటూ అపర్ణ దగ్గరకి వెళుతుంది. బావగారూ మీరూ వినండి అంటూ మాకు తిండికి లెక్కలు వేసి స్వప్నకు పది లక్షలు పెట్టి నక్లెస్ ఇచ్చిందని కంప్లైంట్ చేస్తారు. ఇలా పుట్టింటికి ఎంత ధారపోస్తుందో అంటుంది. రానీ దులిపేస్తాం అంటారు..
కావ్య ఎందుకలా చేసిందని సుభాష్ అంటే..కావ్య తప్పు చేయదని మీకు తెలుసుకదా అంటుంది అపర్ణ. చీకటి పడేసరికి రాజ్, కావ్య ఇంటికి వస్తారు. మాకార్డ్స్ ఎందుకు బ్లాక్ చేశావ్ అని నిలదీసి..మీ అక్కడు పది లక్షలు పెట్టి నక్లెస్ కొనిచ్చావని ఫైర్ అవుతారు.
పుట్టింటికి సొమ్ము చేరవేస్తోందని రుద్రాణి అనడంతో అంత చీఫ్ క్యారెక్టర్ నాదికాదంటుంది. మది స్వప్నకు గోల్డ్ నకెల్స్ ఎలా పుట్టుకొచ్చిందని ఫైర్ అవుతారు. షాక్ అయిన కావ్య..స్వప్ను నిలదీస్తుంది. నువ్వే కదా చెక్ ఇచ్చావ్ అంటుంది స్వప్న. నేను చెక్ ఇచ్చి నక్లెస్ కొనుక్కోమన్నానా అంటుంది..
కావ్యకు అపర్ణ, ఇందిరాదేవి సపోర్ట్ చేస్తారు. ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందనే ఆ రోజు తాళాలు మీకిచ్చాను అంటుంది. ఇప్పుడు నేను పుట్టింటికి దోచి పెట్టేదాన్నయ్యాను అని బాధపడుతుంది. నువ్వు సుద్ధపూస మాట్లాడకు అంటుంది రుద్రాణి. సమాధానం చెప్పాలి కావ్యా అని సుభాష్ నిలదీస్తాడు..
ఎందుకు చెప్పాలి డాడీ అని రాజ్ ఎంట్రీ ఇస్తాడు..స్వప్నా మీ చెల్లి నీకు చెక్ ఇచ్చినప్పుడు ఏం చెప్పిందని అడుగుతాడు. ఇంట్లో ఖర్చులకోసం అని ఇచ్చింది కదా నేను అక్కడే ఉన్నానంటాడు. ఎవరికీ ఏ అవసరం రాలేదు అందుకే ఇది కొనుక్కున్నా అంటుంది స్వప్న. ఇప్పుడు అర్థమైందా నా భార్య పుట్టింటికి రూపాయి కూడా దోచిపెట్టలేదంటాడు.
నా కోడలిపై నాకు నమ్మకం ఉంది..వాళ్లకోసం అడిగానని క్లారిటీ ఇస్తాడు సుభాష్. అక్క ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదా..ఇలా ప్రవర్తించడం సరైనదేనా ..పెద్దదానివయ్యావ్ నీకున్న నగలు సరిపోవా? ఇంత ఖర్చు పెట్టి కొనడం అవసరమా అంటుంది. నీకు కావాలంటే తాతయ్య ఇచ్చిన ప్రాపర్టీ నుంచి కొనుక్కో అంటుంది
ఈ నెక్లెస్ కొనడం వల్లేగా నువ్ ఇలా అంటున్నావ్..తీసుకో అంటూ కావ్య చేతిలో నక్లెస్ , కమ్ములు పెట్టేసి వెళ్లిపోతుంది. దొరికిపోయిన తర్వాత నాటకం ఆడుతున్నారని బురదజల్లుతారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. ఇప్పుడంటే మా ఆయన నా నిర్ధోషిత్వాన్ని నిరూపించారు.. ఇకపై నేను ఎవరికీ సామాధానం చెప్పాల్సిన అవసరం లేదంటుంది
ఖర్చు పెట్టుకునే హక్కు మాకులేదా అని ధాన్యం, రుద్రాణి అంటే..లేదు ఈ విషయంలో సమాధానం చెప్పాల్సిన అవసరం మా అత్తగారికి, మీ అత్తగారికి లేదంటుంది.. హాస్పిటల్ బిల్లు క్లియర్ అవలేదని క్వశ్చన్ చేస్తాడు సుభాష్..
బ్రహ్మముడి డిసెంబర్ 27 ఎపిసోడ్ లో...హాస్పిటల్ బిల్లు క్లియర్ అవలేదని క్వశ్చన్ చేస్తాడు సుభాష్. ఏదో దాస్తున్నారని నిలదీస్తుంది అపర్ణ... కావ్య రాజ్ షాక్ అవుతారు