Brahmamudi Today మే 31 ఎపిసోడ్: అతిగా నసిగితే అంతే .. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేసేలోగా యామిని ఉచ్చు బిగించేసింది - బ్రహ్మముడి మే 31 ఎపిసోడ్ హైలెట్స్!
కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తుండగా వైదేహి పదే పదే కాల్ చేస్తుంది. ఏం జరిగిందో భయపడి రాజ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు.యామిని కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పి ఏడుస్తుంది..వెంటనే రాజ్ బయలుదేరుతాడు
ప్లాన్ మొత్తం ఫెయిల్ అవడంతో కావ్య, దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు. రుద్రాణి సంతోషిస్తుంది
ఇంట్లో వాళ్లంతా బాధగా కూర్చున్న టైమ్ లో అప్పు తీసేసిన నగలు కొట్టేస్తాడు రాహుల్. యామిని ఇచ్చిన షాక్ నుంచి తేరుకునేందుకు ఇంట్లోవాళ్లకి వారం టైమ్ పడుతుంది..ఈ లోగా బంగారం ప్లేస్ లో గిల్ట్ నగలు పెట్టేయాలి అనుకుంటాడు
రాజ్ వచ్చేసరికి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తుంటాడు..సరిగా ఫుడ్ తీసుకోపోవడం వల్ల స్పృహ తప్పారని ప్రస్తుతానిక పర్వాలేదని చెబుతాడు డాక్టర్. ఆమె డిప్రెషన్లో ఉందని చెప్తాడు డాక్టర్
యామినిని పట్టించుకోకుండా ఏం చేస్తున్నారని వైదేహి, రఘునాథ్ పై ఫైర్ అవుతాడు రాజ్. ఈ పరిస్థితికి కారణం మీరే అని రివర్సవుతారు. మీరంటే దానికి పిచ్చి ప్రేమ మీరు దాన్ని పట్టించుకోవడం లేదు అందుకే ఇలా అయిపోయిందని నిందిస్తారు
ఈ పెళ్లో ఇష్టమో కాదో చెప్పాలని డిమాండ్ చేయడంతో తప్పనిపరిస్థితుల్లో ఇష్టమే అని చెప్పి మాటిస్తాడు రాజ్. రెండు రోజులు తనని ఎక్కడికైనా తీసుకెళ్లి సంతోషంగా ఉంచమని చెప్తారు. నా ఫ్రెండ్ కి వికారాబాద్ లో రిసార్ట్ ఉంది అక్కడకి వెళ్లండని చెబుతాడు రఘునాథ్.
ఈ మాటలన్నీ విన్న యామిని..రాజ్ వచ్చేసరికి నిద్రపోయినట్టు నటిస్తుంది. తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు యామిని, వైదేహి, రఘునాథ్ సంతోషిస్తారు
రాజ్ కోసం ఎదురుచూస్తున్న కావ్యను చూసి బాధపడతారు ఇందిరాదేవి, అపర్ణ. నీ బాధ మాకు తెలుసు కానీ వాడు అలా చేస్తాడు అనుకోలేదు అంటారు. నేను మీ మనవడి గురించి ఆలోచించడం లేదు..ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను అంటుంది. ఆయన ఎప్పటికైనా వస్తారు అంటుంది. రాజ్ కాల్ చేశాడా లేదా అని అడుగుతుంది ధాన్యం
ఇందిరాదేవికి కాల్ చేసిన రాజ్.. కళావతికి ప్రపోజ్ చేద్దాం అనుకునేలోగా యామినికి ఇలా జరిగిందని బాధపడతాడు రాజ్. రేపైన వచ్చి కావ్యకు ప్రపోజ్ చేయమని అంటుంది. యామిని తీసుకుని రిసార్ట్ కి వెళుతున్నా అంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్లినా కళావతితోనే వెళ్లాలి అంటుంది ఇందిరాదేవి
నీకోసం రిసార్ట్ కి వచ్చేందుకు రామ్ ని ఒప్పించాను అంటుంది వైదేహి. ముందు ఫస్ట్ నైట్ చేసుకుంటాను..ఆ తర్వాత తప్పనిపరిస్థితిలో తనే నన్ను పెళ్లి చేసుకుంటాడు అంటుంది యామిని. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని వైదేహి కోప్పడుతుంది. ఇదే కరెక్ట్ అంటుంది యామిని
ఎట్టకేలకు అప్పు కళ్యాణ్ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తారు.. అప్పు మాత్రం ఫోన్ చూసుకుంటుంది...
బ్రహ్మముడి జూన్ 02 ఎపిసోడ్ లో కళావతి రిసార్ట్ కి రాగానే ప్రేమను చెప్పాలి అనుకుంటాడు రాజ్. నిన్ను కావ్యకి దగ్గర కానివ్వను అంటుంది యామిని.