యామినితో పెళ్లికి ఒప్పుకున్న రాజ్..తాళి కట్టే సమయానికి ఎంట్రీ ఇచ్చిన అప్పు - బ్రహ్మముడి జూన్ 9 ఎపిసోడ్ హైలెట్స్!
కావ్యకు మ్యాజికల్ వర్డ్స్ చెబుదామని వెళ్లడం..ఏదో అడ్డంకి వచ్చి ఆగిపోవడం..రాజ్ తో పాటూ ఇందిరాదేవి, అపర్ణ కూడా నిరాశ చెందుతున్నారు
యామిని కుట్రకు రాజ్ బలికాకూడదు అని ప్లాన్ చేసి బయటకు తీసుకెళ్లిపోతుంది కావ్య. తీరా రౌడీలు తరమడంతో అడవిలో చిక్కుకుంటారు. పిచ్చి కాయలు తిని మత్తులోకి వెళ్లిపోతారు
కాపాడి ఇంటికితీసుకొస్తుంది అప్పు. అప్పటివరకూ ఆశగా ఎదురుచూసిన ఇందిరాదేవి , అపర్ణ..జరిగింది తెలుసుకుని ఉసూరుమంటారు. కుట్రకు కారణం ఎవరో తెలుసుకునే పనిలో పడుతుంది అప్పు
కావ్యకు చెప్పలేకపోయానే అని బాధపడుతూ ఇంటికి చేరుకున్న రాజ్ కి యామిని తల్లిదండ్రులు షాక్ ఇస్తారు. మరో రెండు రోజుల్లో పెళ్లి మొత్తం రెడీ చేస్తున్నాం అని చెబుతారు
అవాక్కైన రాజ్ ఇక నిజం చెప్పాల్సిన టైమ్ వచ్చేసిందని భావిస్తాడు. పెళ్లి ఇష్టంలేదని మనసులో మాట బయటపెట్టేస్తాడు. కానీ యామిని రెచ్చిపోతుంది
నీతో కలసి బతకని ఈ జీవితం నాకు వద్దంటూ కత్తి పట్టుకుని కోసుకుంటుంది. మా ప్రాణాలు కూడా తీసేసుకో బాబూ అంటూ డ్రామా మొదలుపెడతారు యామిని తల్లిదండ్రులు. రాజ్ మళ్లీ ఆలోచనలో పడిపోతాడు
రాజ్ -యామిన పెళ్లి జరిగిపోతే ఇక తమకు తిరుగుండదనే సంబరంలో ఉంటుంది రుద్రాణి. రాహుల్ కి పట్టాభిషేకం చేసేయవచ్చు అని కలలు కంటుంది
యామిని, ఆమె తల్లిదండ్రుల బెదిరింపులకు రాజ్ తలవంచి తాళికట్టేందుకు సిద్ధమయ్యే సమయంలో గట్టిపోలీస్ అప్పు వచ్చి యామిని కుట్రను బయటపెట్టే అవకాశం ఉంది. అంటే పెళ్లి మరోసారి వాయిదా తప్పదన్నమాట.