Brahmamudi Hamida: 'బ్రహ్మముడి' సీరియల్ లో గయ్యాళిలా వణికించే స్వప్న ( హమీదా) మెస్మరైజింగ్ లుక్
బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన హమీదా ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తోంది. దుగ్గిరాల కుటుంబానికి ఆడబిడ్డని అని చెప్పుకుంటున్న రుద్రాణి కొడుకు రాహుల్ కి భార్యగా నటిస్తోంది
దుగ్గిరాల కుటుంబంలో వారంతా మాట్లాడేందుకు తడబడినా స్నప్న మాత్రం అస్సలు తగ్గకుండా తను ఏం అనుకుంటే అది చెప్పేస్తుంది. కోడలు స్వప్న అంటే అత్త రుద్రాణికి వణుకే...
బ్రహ్మముడి సీరియల్ మొదలైనప్పుడు స్వప్న క్యారెక్టర్ ని పూర్తిగా నెగెటివ్ షేడ్స్ తో చూపించారు. కానీ రాను రాను తన చెల్లెలు కావ్య కష్టాలు చూసి కరిగిపోయింది స్వప్న...
సాహసం సేయరా డింభకా' సినిమాలో నటించింది హమీదా. సిల్వర్ స్క్రీన్ పై వెలగాలని ఆశపడింది కానీ పెద్దగా అవకాశాలు రాలేదు. బిగ్ బాస్ ఆఫర్ తో తనకంటూ ఫాలోయింగ్ సంపాదించుకుంది హమీదా. ఆ షో నుంచి బయటకు వచ్చాక బ్రహ్మముడి సీరియల్ లో ఆఫర్ దక్కించుకుంది
''బ్రహ్మముడి' స్వప్న ( హమీదా) (image credit :Hamida/Instagram)