Brahmamudi April 30th Episode: ఇప్పుడే ప్రేమలో పడినట్టు రాజ్ కావ్య మచ్చట్లు .. శుభలేఖతో షాకిచ్చిన యామిని - బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 30 ఎపిసోడ్ హైలెట్స్!
కావ్యకు కాల్ చేసిన రాజ్..నేను తప్పు చేశాను నిద్రరావడం లేదు అంటాడు. ఏం తప్పు అని అడిగితే..ఆడపిల్ల ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు రావడం కరెక్ట్ కాదనిపించింది అంటాడు.
మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీలయ్యాను అనుకుంటుంది కావ్య. మీ మావయ్యగారు నన్ను చూశారుకదా ఏమైనా అన్నారా అంటే సంతోషంగా ఫీలయ్యారు అంటుంది. నేనిచ్చిన గిఫ్ట్ నచ్చిందా అంటే చాలా బావుంది అంటుంది కావ్య. ఇద్దరూ చాలా సేపు ఫోన్ మాట్లాడుకుంటారు
కిచెన్లో ఉన్న కావ్య దగ్గరకు వచ్చిన అపర్ణ..నా కొడుకుని చూడాలనిపిస్తోంది మాట్లాడాలి అనిపిస్తోంది అంటుంది. ఇప్పుడు ఏం చేయమంటారు అత్తయ్య అని కావ్య అడిగితే..నా కొడుక్కి సైట్ కొట్టమని నేను సలహాలు ఇవ్వాల్సి వస్తోంది అంటుంది.
యామిని, వైదేహి హాల్లో వెయిట్ చేస్తుంటారు. ఇంతాలో రాజ్ వస్తాడు.. వచ్చావా బావా వెళ్దామా అంటుంది యామిని. ఎక్కడికి అంటే.. ఇద్దరం బయటకు వెళ్లాలని చెప్పాను కదా అంటుంది.. ఓ అవును కదా మర్చిపోయాను అంటాడు
కావ్య ఎలాగూ కాల్ చేయలేదు..ఓ రెండు గంటలు యామినితో వెళితే తర్వాత నన్ను ఫ్రీగా వదిలేస్తుంది అనుకుంటాడు. ఇంతలో కావ్య కాల్ చేస్తుంది. అర్జెంటుంగా కలవాలి అంటుంది.
నాకు పని ఉందని చెప్పేసి రాజ్ వెళ్లిపోతాడు. యామిని రాజ్ ని ఫాలో అవుతుంది. కావ్యను కలసి మాట్లాడుతాడు. దూరం నుంచి చూసి యామిని రగిలిపోతుంటుంది.
రాజ్ వెళ్లిపోయిన తర్వాత కావ్య దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇస్తుంది. నాటకాలు ఆడుతూ అదే నిజం అన్న భ్రమలో బతికేస్తున్నావని కావ్య ఇచ్చి పడేస్తుంది. నా భర్తను లాక్కున్నది నువ్వు అని రివర్సవుతుంది కావ్య.
నీకన్నా ముందే రాజ్ జీవితంలోకి నేను వచ్చాను ప్రేమించాను కలసి జీవితం పంచుకోవాలి అనుకున్నాను అంటుంది. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఆయన నీకే దక్కేవారు..నీలాంటి మనస్తత్వం ఉండేవారికి దక్కడం ఆ దేవుడికి కూడా ఇష్టంలేదంటుంది కావ్య. ఇద్దరూ సవాల్ చేసుకుంటారు
బ్రహ్మముడి మే 1 ఎపిసోడ్ లో... కళ్యాణ్ వచ్చి ఇంట్లో అందరకీ చెప్పేస్తాడు రాజ్ బతికి ఉన్నాడని. అది నిజం అంటుంది అపర్ణ. వాడిని వెంటనే ఇంటికి తీసుకొద్దాం అని సీతారామయ్య అంటే... తనకి గతం గుర్తొచ్చేలా చేసి ఇంటికి తీసుకొస్తా అంటుంది కావ్య. మరోవైపు యామిని శుభలేఖ తీసుకొచ్చి రాజ్ చేతిలో పెడుతుంది