Bhanumathi Serial Today March 20 Episode 10 Highlights: భానుతో పార్థు పెళ్లికి నో చెప్పిన బలరాం, అధికారం కోసం శక్తి ఆస్తి కోసం శాంభవి కొత్త స్కెచ్ - భానుమతి మార్చి 20 ఎపిసోడ్ హైలెట్స్!

పార్థు చేసిన సహాయం గురించి తలుచుకుని సంతోషపడుతుంది భానుమతి.. పార్థు గురించే మళ్లీ మళ్లీ ఆలోచిస్తుంటుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మరోవైపు పార్థు...చెప్పాలని వచ్చి చెప్పలేకపోయాను అంటాడు. నువ్వు వీలైనంత త్వరగా మీనాన్నకి చెప్పడం మంచిది అని సూరి అంటాడు. నేను చెప్పలేను మా పిన్నితో చెప్పిస్తా అంటాడు

భానుతో ప్రేమ విషయం గురించి పిన్ని శక్తి చెప్పి..నాన్నకి నువ్వే చెప్పాలి, నా పెళ్లి నువ్వే దగ్గరుండి చేయాలి అంటాడు. ఇదే కదా నాకు కావాల్సిన అవకాశం అనుకుంటుంది శక్తి.
విశ్వనాథం ఇంటికి వచ్చిన భానుమతిని చూసి షాక్ అవుతాడు పార్థు. నువ్వేంటి ఇక్కడకు వచ్చావ్ అంటే.. మీరు సహాయం చేశారు కదా ఈ కాగితాలపై సంతకాలు చేయండి..మీరు నాకు అప్పిచ్చారు కదా ప్రూఫ్ ఉండాలి కదా అంటుంది.
సహాయం అంటే లాభం గురించి చూడనిది అంటాడు. మీరు చాలా మంచోళ్లు జీపబ్బాయ్..మీరు ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తారు అంటుంది. నీక్కూడా నచ్చాడా అని అడుగుతాడు. సంతకం తప్పదు అని భాను అంటే సరే అంటాడు పార్థు..
ఐ లవ్ యూ చెప్పేందుకు వెనక్కు పిలుస్తాడు కానీ ఇంతలో పిల్లలు వచ్చి అల్లరి చేయడంతో భానుమతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయ్యో అనుకుంటాడు పార్థు
పార్ధు అన్నయ్య ప్రేమకు సాయం చేస్తావా అని తల్లిని అడుగుతారు శక్కి కొడుకు కోడలు. పార్థు ఇష్టపడుతున్న అమ్మాయి తండ్రి పది పాతికకు ఒకరి దగ్గర చేయిచాచే వ్యక్తి..ఆస్తి అంతస్తు అనే మాట వినని బతుకులు వాళ్లవి. అలాంటి ఇంటి నుంచి అమ్మాయి కోడలిగా వస్తే మన చేతికింద ఉంటుంది అంటుంది
నువ్వు జీనియస్ వి మామ్..రాజకీయాల్లో ఉంటే రాష్ట్ర రాజకీయాలను తల్లకిందులు చేసేదానివి అని పొగిడేస్తారు శక్తి కొడుకు, కోడలు. నాకు అధికారం కావాలి అందుకోసం ఏమైనా చేస్తాను అంటుంది శక్తి.
ఆవేశంగా ఇంటికొచ్చిన శాంభవి ఊగిపోతుంటుంది. నిన్ను ఇంటికోడలిగా చేద్దాం అనుకుంటే పార్థు జీవితంలోకి మరో అమ్మాయి వచ్చిందని చెబుతుంది.
image 11