చూపులతో కవ్విస్తోన్న గ్లామరస్ యాంకర్.. చీరకట్టులో అమ్మడి అందాలు అదుర్స్..!
తెలుగు ప్రేక్షకులకు మంజూష రాంపల్లి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్స్ తో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ ఆమె. బుల్లితెరకు గ్లామర్ అద్దిన యాంకర్స్ లో మంజూష కూడా ఒకరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమోడల్ గా కెరీర్ ప్రారంభించిన తెలుగమ్మాయి మంజూష.. తన గ్లామర్ తో బుల్లితెర ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో యాంకర్ గా స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో ప్రవేశించి, కొన్ని టీవీ షోలు చేసి గుర్తింపు తెచ్చుకుంది.
యాంకర్ గా రాణిస్తున్న సమయంలోనే మంజూషకు సినిమా అవకాశాలు వచ్చాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్ లో 'రాఖీ' చిత్రంలో నటించే ఛాన్స్ అందుకుంది. అందులో తారక్ చెల్లెలుగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
ఓవైపు టీవీ ప్రోగ్రామ్స్ కు హోస్టుగా చేస్తూనే, మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ వచ్చింది మంజూష. అయితే అందం ఉన్నా కానీ అమ్మడికి అదృష్టం మాత్రం కలిసిరాలేదు.మిగతా యాంకర్ల మాదిరిగా ఆమెకు సినిమాల్లో ఆశించిన గుర్తింపు రాలేదనే చెప్పాలి.
అయితేనేం యాంకర్ గా స్మాల్ స్క్రీన్ మీద అదరగొడుతోంది మంజూష. ఫ్రీలాన్స్ హోస్టుగా సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్స్ చేస్తూ ఏడాది పొడవునా బిజీగా గడుపుతోంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మంజూష.. తరచుగా తన హాట్ హాట్ ఫొటో షూట్స్, వీడియోలను షేర్ చేస్తుంది. ఓపక్క చీరకట్టులో సాంప్రదాయంగా కనిపిస్తూనే, మరోవైపు లేటెస్ట్ ట్రెండీ కాస్త్యుమ్స్ లో గ్లామర్ ట్రీట్ అందిస్తుంది.