✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rajinikanth: ముంబై ఎయిర్ పోర్టులో తళుక్కున మెరిసిన తలైవా

ABP Desam   |  19 May 2023 11:53 AM (IST)
1

రజనీకాంత్ ప్రస్తుతం తన కుమార్తె డైరెక్ట్ చేస్తున్న 'లాల్ సలామ్' సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఇండియన్ క్రికెట్ లెజెండ్ కూడా భాగం కానున్నట్లు రజినీ ప్రకటించారు.

2

'లాల్ సలామ్' చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ లు లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. మొయిదీన్ భాయ్‌ అనే పవర్ ఫుల్ రోల్ లో రజనీ కనిపించనున్నారు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.

3

క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో మాజీ టీమిండియా క్రికెటర్ కపిల్ దేవ్ అతిధి పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని రజనీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

4

''మొట్టమొదటిసారిగా క్రికెట్ ప్రపంచ కప్ గెలిచి భారతదేశాన్ని గర్వించేలా చేసిన లెజెండరీ క్రికెటర్, అత్యంత గౌరవనీయమైన అద్భుతమైన వ్యక్తి కపిల్‌ దేవ్‌ గారితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా ప్రత్యేకంగా భావిస్తున్నాను'' అని రజనీకాంత్ ట్వీట్ చేసారు.

5

ఇటీవల కపిల్ దేవ్ సైతం తన ఫేవరేట్స్ లో ఒకరైన రజనీకాంత్‌ ను కలిసినట్లు ఇంస్టాగ్రామ్ లో వెల్లడించారు. ‘‘గొప్ప వ్యక్తితో కలిసి ఉండటం గౌరవం, ఎంతో ప్రత్యేకం’’ అని మాజీ క్రికెటర్ తన స్టోరీలో పేర్కొంటూ, సూపర్ స్టార్ తో ఉన్న ఓ పిక్ ని షేర్ చేసారు.

6

'లాల్ సలామ్' అనేది ఐశ్వర్య రజనీకాంత్ ఏడేళ్ల విరామం తర్వాత దర్శకత్వం వస్తున్న సినిమా. క్రికెట్, కమ్యూనిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

7

'లాల్ సలామ్' సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.

8

రజనీ కాంత్ ప్రస్తుతం 'డాక్టర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

9

అనంతరం 'జై భీమ్' ఫేమ్ దర్శకుడు TJ జ్ఞానవేల్‌ తో రజనీ ఓ సినిమా చేయనున్నారు.

10

అటు 'విక్రమ్' ఫేమ్ లోకేష్ కనగరాజ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాయే రజనీ కెరీర్ లో చివరి సినిమా అవుతుందిని తమిళ డైరెక్టర్ మిస్కిన్ తాజాగా వెల్లడించారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Rajinikanth: ముంబై ఎయిర్ పోర్టులో తళుక్కున మెరిసిన తలైవా
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.