Happy Birthday Shreya Ghoshal: సింగర్ శ్రేయా ఘోషల్ బర్త్‌డే - తెలుగులో ఆమె పాడిన ఫస్ట్ సాంగ్ ఏదో తెలుసా?
Happy Birthday Shreya Goshal: శ్రేయా ఘోషల్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రముక బాలీవుడ్ సింగరైన ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ భాషల్లోనూ పాటలు పాడి ఆకట్టుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగు రాకపోయిన తన అత్యద్భుతమైన పాటలతో ఎంతోమంది ఆడియన్స్‌ని అలరిస్తున్నారు. తెలుగులో ఆమె దాదాపు 300లకు పైగా పాటలు పాడారు.
12వ ఏటనే గాయనీగా కెరీర్ మొదలు పెట్టి.. తనదైన గాత్రంతో అతి చిన్న వయసులోనే స్టార్ సింగర్ ఎదిగారు. ఈరోజు శ్రేయా ఘోషల్ పుట్టిన రోజులు. నేటితో ఆమె 40వ వసంతంలోకి అడుగుపెట్టారు.
నిజానికి శ్రేయా ఘోషల్‌ది బెంగాళీ నేపథ్య కుటుంబం. 1984 మార్చి 12న పశ్చిమ బెంగాల్లో జన్మించారు.
శ్రేయా ఘోషల్ అంటే ఆ పాట హిట్ అనేంతగా ఆమె ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. ఘోషల్ దేవదాస్ (Devadas) అనే హిందీ మూవీతో తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఆమె ఫస్ట్ మూవీకే 'భారత జాతీయ చలనచిత్ర అవార్డు' అందుకున్నారు.
ఎలాంటి పాటైనా తనదైన గాత్రంతో సంగీత ప్రియులు మెస్మరైజ్ చేస్తారు. పాడి అందరినీ మైమరిపింపజేస్తుంది. అలా తన అద్భుతమైన గానంతో ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు.
సింగర్ తన కెరీర్లో ఇప్పటి వరకు ఆమె 4 సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు,4 జాతీయ పురస్కారాలు, 5 నార్త్ ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.
మహేష్ బాబు, భూమిక ఒక్కడు మూవీలోని నువ్వేం మాయ చేశావో గానీ పాటతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో ఎన్నో పాటలు పాడి ఎవుర్గ్రీన్ బ్లాక్‌బస్టర్స్ అందించారు శ్రేయా ఘోషల్.
నిజానికి శ్రేయా ఘోషల్ గాత్రమే ఎవర్గ్రీన్ అనాలి. అలా తన ప్రత్యేకమైన గానంతో ఎంతోమంది శ్రోతలను శ్రేయా 30 అలరిస్తూనే ఉన్నారు.
సింగర్ శ్రేయా ఘోషల్ కు పుట్టిన రోజు శుభకాంక్షలు