Shivathmika Photos: పచ్చ చీరలో శివాత్మిక హోయలు - రవివర్మ చిత్రంలా వయ్యారాలు పోతున్న 'దొరసాని'
Shivathmika Latest Photos: శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
టాలీవుడ్ యాంగ్రీమేన్, హీరో రాజశేఖర్, జీవిత దంపతులు ముద్దుల తనయ, చిన్న కూతురే శివాత్మిక
తండ్రి నటవ వారసురాలిగా దొరసాని చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. తొలి చిత్రంతోనే తనదైన నటనతో సర్‌ప్రైజ్ చేసింది.
చక్కటి ముఖారవిందం, అభినయంతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత పంచతంత్రం, ఆకాశం, రంగస్థలం వంటి చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది.
దీంతో ఆమెకు వరస ఆఫర్స వస్తున్నా.. అన్నింటికి ఒకే చేయకుండ జాగ్రత్తగా స్క్రిప్ట్స్ ఎంచుకుంటుంది. చివరిగా పంచతంత్రం సినిమాలతో అలరించింది శివాత్మిక.
మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుటికప్పుడు తన లేటెస్ట్ లుక్, ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ ప్యారెట్ గ్రీన్ చీరలో మెరిసింది. పెసరు రంగు చీరలో శివాత్మిక రవివర్మ చిత్రంలా వయ్యారాలు పోయింది.
ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో చిత్రంలో ఒక్కో ఫోజులతో ఎల్లోరా చిత్రంలా హోయలు పోయింది.
ఇలా శివాత్మిక చూసి కుర్రకారు ఫిదా అవుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.