Ram Charan: రామ్ చరణ్ లగ్జరీ కార్ కలెక్షన్!
మెగాస్టార్ తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోల్లో ఒకరిగా చెలామణి అవుతున్నారు. అయితే రామ్ చరణ్ కు అసలు నటన మీద ఆసక్తి ఉండేది కాదు. ఆయనకు కార్లంటే పిచ్చి. చిన్నప్పటి నుండి కార్లు వాటి ఇంజనీరింగ్ మీద దృష్టి పెట్టేవారు. అదే విషయాన్ని తన తండ్రికి చెప్పి యూరప్ లో దానికి సంబంధించిన కోర్సు చేద్దామని అనుకున్నారు.
కానీ ఫైనల్ గా నటుడిగా మారిపోయారు. అయినప్పటికీ తనకు కార్ల మీద ఉన్న ఇష్టం మాత్రం పోలేదు. ఆయన గ్యారేజ్ లో ఎన్నో కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. మార్కెట్ లోకి పేరున్న కారు ఏదైనా వచ్చిందంటే చాలు కొనడానికి ముందుంటారు రామ్ చరణ్. ప్రస్తుతం ఆయన దగ్గర నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి.
అందులో ఒకటి ఆస్టన్ మార్టిన్ వ్యాంటేజ్. ఈ కారుని మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇదే రామ్ చరణ్ ఫస్ట్ కార్. అందుకే ఈ కారుని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దీని వీలుగా రూ.3 కోట్లకు దగ్గరగా ఉంటుంది.
మెర్సిడీస్ బెంజ్ జీఎల్350 అనే మరో ఖరీదైన కారుని కొనుగోలు చేశారు చరణ్. ఈ కారు విలువ రూ.80 లక్షలు.
చరణ్ దగ్గర ఉన్న మరో విలువైన కారు.. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పాపులర్ యాక్టర్స్ కి ఈ కార్ అంటే చాలా ఇష్టం. దీని పెర్ఫార్మన్స్, ఎలిగంట్ లుక్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. దీని విలువ దాదాపు రూ.4 కోట్లు.
వీటితో పాటు చరణ్ దగ్గర మెర్సిడీస్ ఎస్ క్లాస్ డబ్లూ 221 అనే కారు కూడా ఉంది. దీని ధరం కోటిన్నర.
కార్లతో పాటు చరణ్ కి గుర్రాలంటే కూడా చాలా ఇష్టం. గుర్రపు స్వారీ అంటే చరణ్ ఒకరకమైన అడిక్షన్. దీనికోసం గిండీ ఫారెస్ట్ క్లబ్ లో జాయిన్ అయ్యి ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం చరణ్ దగ్గర ఆరుకి పైగా గుర్రాలు ఉన్నాయి. అలానే కొన్నాళ్లక్రితం తన భార్యకు చిన్న గుర్రాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు.