Sai Pallavi Pics : అందం అమ్మాయైతే.. అది మన హైబ్రిడ్ పిల్లే!
ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు. తన కిల్లర్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ కట్టిపడేస్తుంది. హీరోలకు పోటీగా డాన్స్ చేస్తూ యూత్ ని ఫిదా చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించేసింది సాయి పల్లవి కమర్షియల్ సినిమాలకు దూరంగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ కథలనే ఎన్నుకుంటుంది.
మలయాళంలో నివిన్ పాలీ, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది.
తమిళంలో ధనుష్, సూర్య లాంటి హీరోలతో కలిసి నటించింది. తెలుగులో యంగ్ హీరోలతో కలిసి తెరపై సందడి చేసింది.
సాధారణంగా హీరోయిన్లకు ఇండస్ట్రీలో లైఫ్ స్పాన్ తక్కువ. అందుకే ఉన్నన్ని రోజుల్లో బాగా సంపాదించాలని నిర్ణయించుకొని ఉంటారు.
ఈ క్రమంలో సినిమాలు, యాడ్స్, ప్రమోషన్స్ అంటూ ఎక్కడ సంపాదన ఉంటే దానికి ఓకే చెప్తారు. కానీ సాయి పల్లవి అలా కాదు.
తన కెరీర్ లో ఇప్పటివరకు దాదాపు మూడు యాడ్స్ ను రిజెక్ట్ చేసింది. ఆర్టిఫిషియల్ బ్యూటీ ప్రాడక్ట్స్‌ని ప్రమోట్ చేసే అవకాశాలు వస్తే వద్దనుకుంది.
వాటి ద్వారా ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని క్రియేట్ చేయలేనని అంటోంది. తన చెల్లికి కూడా ముఖంపై మొటిమలు ఉంటాయని.. ఇలాంటి ఫెయిర్ నెస్ క్రీములు వాడమని తనకే చెప్పనని.. అలా తనను మిస్ గైడ్ చేయలేనని.. అలాంటిది ఆ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండలేననేది సాయిపల్లవి భావన.