అమెరికా నుంచి ఢిల్లీకి రామ్ చరణ్, అభిమానుల ఘన స్వాగతం
ఆస్కార్ వేడుకల తర్వాత భారత్ కు చేరుకున్న రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఢిల్లీలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘జై చరణ్’ అంటూ నినాదాలు చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సందర్భంగా చెర్రీతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి.. ‘నాటు నాటు’ పాటను సూపర్ హిట్ చేసిన ప్రతి భారతీయు సినీ అభిమానికి చెర్రీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు. దేశ ప్రజలే ఈ పాటను ఆస్కార్ కు తీసుకెళ్లారన్నారు.
ఈ రోజు ఢిల్లీలో జరగనున్న పలు కార్యక్రమాల్లో రామ్ చరణ్ పాల్గొననున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను కలవనున్నారు. Photo Credit: Upasana Kamineni Konidela/Instagram
అనంతరం చెర్రీ దంపతులు హైదరాబాద్ కు చేరుకుంటారు. Photo Credit: Upasana Kamineni Konidela/Instagram
రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ‘ఆర్ సి 15’ సినిమాలో నటిస్తున్నారు. Photo Credit: Upasana Kamineni Konidela/Instagram
ఈ మూవీలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. Photo Credit: Upasana Kamineni Konidela/Instagram