Ram Chaarn: ఇకపై డా.రామ్ చరణ్ - గౌరవ డాక్టరేట్ అందుకున్న 'గ్లోబల్ స్టార్', ఫోటోలు చూశారా?
Ram Charan Received Doctorate: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు డా. రామ్ చరణ్ అయిపోయారు. తాజాగా చరణ్ వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.
సినీరంగ, ఎంటర్‌ప్రెన్యూరర్‌గా ఆయన అందిస్తున్న సేవలకుగానూ చెన్నై వేల్స్ యూనివర్సిటీ ఈ ఏడాది లిటరేచర్‌లో ఆయనకు డాక్టరేట్‌ను ప్రకటించింది.
ఇక ఈరోజు యూనివర్సిటీలో జరిగిన 14వ వార్సికోత్సవ వేడుకలలో భాగంగా చరణ్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానం ఇచ్చి గౌరవ డాక్టరేట్ సత్కరించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది చరణ్‌తో పాటు డా.పి.వీరముత్తువేల్ (ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ చంద్రయాన్, ఇస్రో), డా.జి.ఎస్.కెవేలు (ఫౌండర్, సీఎండి ట్రివిట్రోన్ హెల్త్ కేర్), అచంట శరత్ కమల్ (పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రముఖ టేబుల్ టెన్నిల్ ప్లేయర్)లను కూడా డాక్టరేట్‌తో గౌరవించారు.
డాక్టరేట్ అందుకున్న అనంతరం చరణ్ మాట్లాడుతూ ఈ గౌరవం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకు దక్కిన ఈ గౌరవం తన ఒక్కడితే కాదని, తన అభిమానులు, దర్శకులు, నిర్మాతలు, సహానటీనటులదని పేర్కొన్నారు.