Priyanka Mohan Photos: బ్లాక్ డ్రెస్‌లో ప్రియాంక మోహన్ హాట్ ట్రీట్ - కొంటె చూపులతో మాయచేస్తున్న 'ఓజీ' బ్యూటీ
Priyanka Mohan Latest Photos: ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
తొలి చిత్రంతోనే తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరైంది. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు వచ్చిన గుర్తింపు ప్రియాంక ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు.
కానీ, ఎందుకో తెలియదు ఆ తర్వాత ఆమెకు ఇక్కడ పెద్దగా ఆఫర్స్ రాలేదు. తమిళంలో సూర్య వంటి స్టార్ హీరో సరసన నటించింది. ఇప్పుడు తెలుగులో ఆమె వరుస ఆఫర్స్ అంందుకుంటుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఆమె మరోసారి నానితో జతకడుతుంది.
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాబోయే ఓ మూవీలో ఆమె హీరోయిన్‌గా కన్‌ఫాం అయినట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో .
ఓ వైపు వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న ప్రియాంక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అయ్యింది. ఈ మధ్య తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఈ బ్యూటీ ఫిదా చేసింది. కొంటెగా చూస్తూ మత్తు కళ్లతో మైమరిపించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.