mamitha Baiju: ప్రేమలు బ్యూటీ మమిత ట్రెడిషనల్ లుక్ - చీరలో మెరిసిన మలయాళి బ్యూటీ
Mamitha Baiju Traditional Look: మమిత బైజు.. కొద్ది రోజలుగా ఇండస్ట్రీలో ఈ పేరు మారుమోగుతుంది. లేటెస్ట్ లవ్ డ్రామా 'ప్రేమలు' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది.
అప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రేమలు చిత్రమే ఆమెకు బ్రేక్ ఇచ్చింది. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది.
పాజిటివ్ రివ్యూస్, భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించడంతో మమిత పేరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇందులో తన యాక్టింగ్ స్కిల్స్, లుక్‌తో యూత్‌ని ఫిదా చేసింది. దీంతో ప్రస్తుతం కుర్రకారు అంతా మమిత పేరునే కలవరిస్తుంది.
మరోవైపు మమితా సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని అలరిస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ ట్రెడీషనల్ లుక్‌లో ఆకట్టుకుంది. సిల్క్ చీర కట్టి కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.