Malavika Mohanan: ప్రభాస్ 'రాజాసాబ్' రాణి మాళవిక మోహనన్ రాయల్ లుక్!

మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Malavika Mohanan)
వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న కోలీవుడ్ హీరోయిన్ మాళవిక మోహనన్..తెలుగులో రాజాసాబ్ మూవీతో ఎంట్రీ ఇస్తోంది
టాలీవుడ్ లో ఫస్ట్ ప్రాజెక్టుకే ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం అందుకుంది. ‘యుధ్రా’ అనే మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది..
రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న రాజాసాబ్ లో అవకాశం రావడం చెప్పలేనంత ఆనందంగా ఉందంది మాళవిక మోహనన్..
సాధారణంగా ప్రభాస్ తో కలసి నటించినవారు ఎవరైనా కానీ తను పెట్టే ఫుడ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతారు. మాళవిక కూడా అదే మాట చెప్పుకొచ్చింది. ఓ టీమ్ కి కాదు ఓ ఊరికి సరిపడా భోజనం తెప్పిస్తాడంటూ ప్రభాస్ గొప్పతనం చాలాసార్లు చెప్పింది
మారుతి దర్శకత్వంలో వస్తోన్న రాజాసాబ్ ఏప్రిల్ 10న సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతోంది. మరి తెలుగులో నేరుగా మాళవిక నటించిన ఫస్ట్ మూవీ తనకి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి