Karthika Deepam 2 January 29th Highlights : కార్తీకదీపం 2 సీరియల్ జనవరి 29వ తేది హైలైట్స్.. దీప దగ్గర మాట తీసుకున్న కార్తీక్.. కాంచనకు డబ్బులివ్వకుండా కుటుంబానికి దూరం చేస్తోన్న జ్యోత్స్న
శౌర్యని చూసేందుకు తీసుకెళ్లాలని దీప పరిగెత్తుకుంటూ వెళ్తుంది. దీపని ఆపి.. పాపని చూపిస్తాను కానీ నాకో మాట ఇవ్వంటూ కార్తీక్ ఆపుతాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
శౌర్య ముందు నువ్వు ఏడిస్తే నా మీద ఒట్టు అని కార్తీక్ తన మీద ఒట్టు వేసుకుంటాడు. ఇప్పటికే ప్రాణం లేని శవంలా నిల్చొన్నా మీ మాటలతో నన్ను నిలువునా సమాధి కట్టేయొద్దని దీప ఏడుస్తూనే మాట ఇచ్చింది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
నాన్న నీకు కార్తీక్ మీద దీప మీద కోపం ఉండొచ్చు కానీ కాంచన నా రక్తం పంచుకుపుట్టిన చెల్లి అంటూ దశరథ్ చెప్తాడు. కాంచన సాయం కోసం ఇంటికి వచ్చింది మనం హెల్ప్ చేయాల్సింది అంటాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
మామయ్య మనం ఈ ఇంటి బిడ్డని బాధ పెట్టడం అంత మంచిది కాదని సుమిత్ర చెప్తుంది. దీప పేరు ఎత్తగానే వాళ్లు వెళ్లిపోవడంతో అర్థమైంది వాళ్ల ఉద్దేశమంటూ.. శివనారయణ చెప్తాడు. ఇదే మాట ఎన్ని సార్లు అంటావు నాన్న అంటూ దశరథ్ చెప్పాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
ఇదంతా వింటూ జ్యోత్స్న మనసులో బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది. శౌర్య వ్యాధి నిజమే అంటే అందరూ ఈ వంకతో కలిసిపోతారని.. అత్త చెప్పింది నిజమో కాదో అని దీప దగ్గరకు వెళ్లాను. ఇదంతా దీప డబ్బు కోసం ఆడించిన నాటకమంటూ చెప్పింది అంటూ చెప్తోంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
శౌర్య తల్లిదండ్రుల ఫొటో పట్టుకొని నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని బాధపడుతూ ఉంటుంది. దీప, కార్తీక్‌లు అదే సమయంలో హాస్పిటల్‌కి వస్తారు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
కార్తీక్ దీపని ఏడవొద్దని చెప్తాడు. కానీ దీప పాపని పట్టుకొని ఏడుస్తుంది. పాప చూడకుండా కన్నీరు తుడుచుకుంటుంది. పాప మాటలకు దీప, కార్తీక్ బాధ పడతారు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
దీప బయటకొచ్చి ఏడుస్తుంటే.. శౌర్య గురించి నీకు ఎవరు చెప్పారని కార్తీక్ అడుగుతాడు. దీంతో జ్యోత్స్న అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)