Brahmamudi January 29th Episode Highlights: విదేశాలకు రాజ్ కావ్య - మరో మంట పెడుతున్న మందర రుద్రాణి - బ్రహ్మముడి జనవరి 29 ఎపిసోడ్ హైలెట్స్!
మావయ్య మీరు చెబితే ప్రకాశం మావయ్య వింటారంటూ సుభాష్ ని ఆశ్రయిస్తుంది కావ్య. చేసిందంతా నువ్వుచేసి మా ఆయన్ని ఎలా చెప్పమంటున్నావ్ అని ఫైర్ అవుతుంది అపర్ణ.
పరిస్థితి చేయిదాటిపోయింది ఏం చేద్దాం అని రాజ్ బాధపడతాడు. ఇన్నాళ్లూ బెదిరిస్తున్నారన అనుకున్నాం కానీ నిజంగా ఇలానే చేస్తారని అనుకోలేదని కావ్య అంటుంది. వాళ్లు కోర్టుకు వెళితే మొత్తం మీడియాకు తెలిసిపోతుంది. ఇక పూర్తిగా మునిగిపోతాం. ఎలాగైనా వాళ్లని ఆపాలని అనుకుంటారు.
రాహుల్, రుద్రాణి తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. మొత్తానికి అనుకున్నది సాధించాం అనుకుంటారు. మనకు ఆస్తి రాకుండా చేయడం ఎవరి వల్లా కాదు అనుకుంటారు. డాన్స్ చేస్తుంటారు.ఇంతలో స్వప్న వచ్చి సెటైర్స్ వేస్తుంది.
నీ చెల్లెలు ఎలాంటిదో తెలిసి కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నావ్ అంటూ నువ్వు నీతులు చెప్పకు అంటుంది. నేను ఆస్తి వచ్చాక మారలేదు నా చెల్లెలు కావ్య గొప్పతనం తెలుసుకుని మారానంటుంది. కావ్య ఉండగా మీరు అనుకున్నది జరగదని హెచ్చరించి వెళ్లిపోతుంది
తల్లి మాటలు తలుచుకుని బాధపడుతుంది ఇందిరాదేవి. కోర్టుకు రాను అంటాడు కానీ ధాన్యలక్ష్మి బలవంతంగా బయలుదేరిస్తుంది. ఇంతలో కిందకు లాయర్ రావడంతో అంతా షాక్ అవుతారు.
లాయర్ ని ఎవరు పిలిపించారని అడిగితే మేమే అంటుంది ధాన్యలక్ష్మి. తాత ఆస్తిపై హక్కు మనవడిది కదా మరి వీళ్లిద్దరూ కోర్టులో కేసు వేస్తే నిలబడుతుందా అని అడుగుతుంది.. మా ఆయనతో కాకపోతే నా కొడుకుతో కేసు వేయిస్తా అంటుంది ధాన్యం..ఇంతలో కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడు
నా ఇష్టం లేకుండా.. నా సంతకం లేకుండా.. నా అనుమతి లేకుండా కేసెలా వేస్తారని క్లాస్ వేస్తాడు. ఇది నీ భవిష్యత్ కోసమే అని ధాన్యలక్ష్మి అంటుంది. ప్రకాష్ ని అడిగితే మీ అమ్మ కారణంగా తప్పలేదు అంటాడు. కళ్యాణ్ క్లాస్ వేస్తాడు..
తత్వం కవిత్వం కడుపునింపవు అని రుద్రాణి అంటే నాది నీలాంటి తత్వం కాదులే అంటాడు. నేను ఆస్తి అడిగానా నా తరపున పోరాడి నా వ్యక్తిత్వాన్ని దిగజార్చే హక్కు నా తల్లికి ఎక్కడిది..ఇంత గొప్ప కుటుంబాన్ని నాకు దూరం చేసే హక్కు నా తండ్రికి ఎక్కడిది అంటాడు
బ్రహ్మముడి జనవరి 30 ఎపిసోడ్ లో...నాకు, నా భార్యకు వీసా, పాస్ పోర్ట్ కావాలని రాజ్ ఫోన్లో మాట్లాడుతాడు..మరోవైపు కావ్య 30 రోజుల్లో ఇంగ్లీష్ భాష బుక్ చదువుతూ ఉంటుంది.. ఇదంతా వింటుంది, చూస్తుంది రుద్రాణి..ధాన్యం దగ్గరకు వెళ్లి మొత్తం చేప్పేస్తుంది