Pooja Hegde: బర్త్ డే గర్ల్ పూజా హెగ్డే - బుట్ట బొమ్మకు ఆ నవ్వే అందం!
అందాల తార పూజా హెగ్డే అక్టోబరు 13, 1990న ముంబై లో జన్మించింది. తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. Photo@pooja Hegde/facebook
పూజా తల్లి దండ్రులది కర్ణాటక అయినా, ముంబైలో స్థిరపడ్డారు. Photo@pooja Hegde/facebook
పూజా తులుతో పాటు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ్ కూడా మాట్లాడుతుంది. Photo@pooja Hegde/facebook
ముంబై ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్ లో పీజీ చేసిన పూజా.. భరతనాట్యంలో శిక్షణ పొందింది. Photo@pooja Hegde/facebook
2010లో విశ్వసుందరి పోటీల్లో ఇండియా నుంచి పాల్గొనేందుకు జరిగిన అందాల పోటీల్లో పూజా రెండో స్థానంలో నిలిచింది. Photo@pooja Hegde/facebook
క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ కు ఫ్యాన్. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం, జెన్నిఫర్ లోపెజ్ పాలంటే ఎంతో ఇష్టం. హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమాలు ఎంతో ఇష్టపడుతుంది. Photo@pooja Hegde/facebook
హీరోయిన్‌గా పూజా ఫస్ట్ మూవీ ‘మూగముడి’ అనే తమిళ చిత్రం. జీవా హీరోగా చేసిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. Photo@pooja Hegde/facebook
నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తొలి సినిమా ఫర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ‘ముకుందా’ సినిమాలో నటించింది. Photo@pooja Hegde/facebook
అనంతరం బాలీవుడ్‌లో హృతికో రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాలో హీరోయిన్ గా చేసింది. Photo@pooja Hegde/facebook
ఇక తెలుగులో‘రంగస్థలం’ సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ సాధించింది. తాజాగా ప్రభాస్ హీరోగా చేసిన పాన్ ఇండియన్ మూవీ ‘రాధేశ్యామ్’లో హీరోయిన్ గా చేసింది. చిరంజీవి ‘ఆచార్య’లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నది. Photo@pooja Hegde/facebook