Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3లో ఫస్ట్ ఎలిమినేషన్ - షో నుంచి వెళ్లినా తమన్ కంట్లో పడ్డాడు, సర్‌ప్రైజ్ కొట్టేశాడు
Kushal Sharma was eliminated from Telugu Indian Idol 3: 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' నుంచి యువ గాయకుడు కుషల్ శర్మ ఎలిమినేట్ అయ్యాడు. ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ ఇదే. దాంతో అతడు స్టేజి మీద ఎమోషనల్ అయ్యాడు.
Thaman invited Kushal Sharma and his mom for lunch: 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ రౌండులో ఎలిమినేట్ అయిన కుషల్ శర్మకు ప్రముఖ సంగీత దర్శకుడు, షో జడ్జ్ తమన్ నుంచి సర్‌ప్రైజ్ అందుకున్నాడు. కుషల్ శర్మతో పాటు అతడి తల్లిని తమన్ భోజనానికి ఆహ్వానించారు.
'తెలుగు ఇండియన్ ఐడల్ 3'లో భరత్ రాజ్, స్కంద నుంచి కుషల్ శర్మ పోటీ ఎదుర్కొన్నాడు. స్కందకు హయ్యస్ట్ వోట్స్ రావడంతో భరత్ రాజ్ లేదా కుషల్ శర్మలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. ఆడియన్స్ నుంచి కుషల్ శర్మకు తక్కువ వోట్స్ రావడంతో అతడు ఎలిమినేట్ అయ్యాడు.
ఎలిమినేట్ కావడంతో స్టేజి మీద కుషల్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. అతడికి మిగతా 11 మంది కంటెస్టెంట్లు వీడ్కోలు పలికారు. తనకు ఎంతో సపోర్ట్ చేసిన, ఇన్స్పైర్ చేసిన కార్తీక్, తమన్, గీతా మాధురిలకు కుషల్ శర్మ థాంక్స్ చెప్పాడు.
తమన్, కార్తీక్, గీతా మాధురి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న 'తెలుగు ఇండియన్ ఐడల్ 3'కు శ్రీరామచంద్ర హోస్ట్. జూన్ 14, 2024న ఈ షో మొదలు అయ్యింది.
ఆహా ఓటీటీలో ప్రతి శుక్ర, శని వారాల్లో రాత్రి 7 గంటలకు 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' కొత్త ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతాయి. యువ గాయనీ గాయకులకు వ్యూవర్స్ వోట్ వేయవచ్చు. శనివారం రాత్రి 7 గంటల నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకు వోటింగ్ జరుగుతుంది.