Exit Poll 2024
(Source: Poll of Polls)
Sitara Ghattamaneni: అంబానీ పెళ్లిలో సితార హంగామా - ఆరాధ్య బచ్చన్‌తో సెల్ఫీ, రణ్‌వీర్ సింగ్‌తో అల్లరి, సితూ పాప సందడి మామూలుగా లేదు
Sitara Shared Ambani Weeding Pics: అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు అయ్యాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు పది రోజుల పాటు ఘనంగా జరిగాయి. జూలై 12న వీరి మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లిలో నార్త్ నుంచి సౌత్ సినీ తారలంతా హాజరై సందడి చేశాడు.
ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరొద్కర్, కూతురు సితారతో కలిసి అంబానీ పెళ్లిలో పాల్గొన్నారు. ఈ వివాహ వేడుకలో సితార హంగామా మామూలుగా లేదు.
బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి సెల్పీలు దిగుతూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సితార పాప తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఇందులో సీనియర్ నటి రేఖ నుంచి రణ్‌వీర్ సింగ్, కియార అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా, ప్రియాంక-నిక్ జోనస్ కపుల్స్‌తో కలిసి సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది.
అలాగే మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్, తన కూతురు ఆరాధ్యతో కలిసి సెల్ఫీ దిగింది. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అల్లరి చేసింది. ఇక ఈ ఫోటోలు చూస్తుంటే సితార అంబానీ పెళ్లి బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తుంది.
కాగా మహేష్ బాబు కూతురిగా సితారకు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ నెట్టింట తన ఫాలోవర్సని పెంచుకుంటుంది.
ఇప్పటికే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌గా సితార యమ క్రేజ్‌ను సంపాదించుకుంది. దానితో పాటు ఇటీవల ఓ జువెల్లరి యాడ్‌లో నటించిన గుర్తింపు సంపాదించుకుంది.