Rasika Dugal: చీరలో కైపెక్కిస్తున్న ‘మిర్జాపూర్’ క్వీన్ బీనా త్రిపాఠి - రసిక దుగ్గల్ క్రేజే వేరు!
బీనా త్రిపాఠి.. ‘మిర్జాపూర్’లో తనపై అత్యాచారానికి ఒడిగట్టిన మామగారిని కసితీర చంపి కక్ష తీర్చుకొనే ఈ పాత్రను ఓటీటీ ప్రేక్షకులు ఎవరూ మరిచిపోలేరు. బీనా అసలు పేరు రసిక దుగాల్. వెబ్ సీరిస్‌లో కాలీన్ భయ్యాకు భార్యగా నటించింది. తాజా ఆమె శారీలో కత్తిలాంటి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. - Rasika Dugal/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘మిర్జాపూర్’ వెబ్ సీరిస్ సీజన్ 3లో ఈమె పాత్రకు మంచిగానే ప్రాధాన్యం లభించింది. అయితే, సీజన్-1లో ఉన్నంత మసలా 3వ సీజన్లో లేదు. అందుకే ప్రేక్షకులు బాగా నిరుత్సాహానికి గురయ్యారు. పైగా గుడ్డు భయ్యాతో తప్పకుండా కొన్ని రొమాంటిక్స్ సీన్స్ ఉంటాయని ప్రేక్షకులు భావించారు. కానీ, వారిని వీడదీసేశారు. 4వ సీజన్లో కేవలం గుడ్డు, గోలుకు మాత్రమే రొమాన్స్ నడిచే అవకాశాలున్నాయి. - Rasika Dugal/Instagram
తాజా సీజన్లో బీనా.. మీర్జాపూర్‌కు రాణిగా ఉండాలనే కోరిక పుడుతుంది. తాను కూడా ఒక బాహుబలిగా మాఫియా ప్రపంచాన్ని ఏలాలని భావిస్తుంది. అందుకే గుడ్డుకు డ్రగ్స్ అలవాటు చేసి.. వలలో వేసుకోవాలని చూస్తుంది. గోలు చనిపోయిందని భావించి గుడ్డుతో కలిసి దందా చేయాలని ప్లాన్స్ వేస్తుంది. కానీ, అది వర్కవుట్ కాదు. - Rasika Dugal/Instagram
‘మీర్జాపూర్’ సీరిస్‌లో పాపులారిటీ సంపాదించిన పాత్రల్లో బీనా కూడా ఒకటి. మొదటి సీజన్స్ కొన్ని బెడ్స్ సీన్స్ వ్యూవర్స్‌ను పిచ్చెక్కించాయి. - Rasika Dugal/Instagram
‘మీర్జాపూర్’ సీజన్ 1లో ఆమె చేసిన బోల్డ్ సీన్స్ చూసినవాళ్లు.. తప్పకుండా సీజన్-3లో కూడా అలాంటి సీన్లు ఉంటాయని భావిస్తారు. కానీ, ఈ సీజన్లో ఆ సీన్స్ ఏవీ లేవు. రసిక ‘మీర్జాపూర్’ సీజన్ కంటే ముందు పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. 2007లో ‘అన్వర్’ మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. - Rasika Dugal/Instagram
రసిక దగల్ పుట్టిన ఊరు.. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్. 2007 నుంచి 2014 వరకు ఆమె చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఈ స్థాయికి చేరింది. 2018లో ‘మీర్జాపూర్’ వెబ్ సీరిస్తో లక్కీ ఛాన్స్ లభించింది. దీనితోపాటు ఆమె ‘మేడిన్ హెవెన్’, ‘ఢిల్లీ క్రైమ్’, ‘అవుట్ ఆఫ్ లవ్’, ‘అదురా’ వెబ్ సీరిస్‌ల్లో కూడా నటించింది. - Rasika Dugal/Instagram