Kanyaka Movie OTT Release Date: వినాయక చవితికి ఓటీటీలో 'కన్యక' - కేవలం 49 రూపాయలకే, ఎందులో చూడొచ్చంటే?
శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ సంస్థలో, రాఘవేంద్ర తిరువాయి పాటి దర్శకత్వంలో కేవీ అమర్, పూర్ణ చంద్ర రావు, సాంబశివ రావు నిర్మించిన సినిమా 'కన్యక'. మహిళల పట్ల తప్పుగా ప్రవరిస్తే ఎవరు క్షమించి వదిలేసినా అమ్మవారు తప్పకుండా శిక్షిస్తుందనే కథాంశంతో తెరకెక్కింది. ఆగస్టు 15న పాటలు, రాఖీ సందర్భంగా ఆగస్టు 20న ట్రైలర్ విడుదల చేశారు. సినిమాను వినాయక చవితికి ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గణేష్ చతుర్థి సందర్భంగా 'కన్యక' చిత్రాన్ని Bcineet ఓటీటీలో విడుదల చేస్తున్నారు. కేవలం 49 రూపాయలు చెల్లించి, రెంటల్ విధానంలో సినిమాను చూడవచ్చని ఓటీటీ నిర్వాహకులు తెలిపారు. శివరామరాజు, 'జబర్దస్త్' వాసు, ఈశ్వర్, శ్రీహరి, పీవీఎల్ వర ప్రసాదరావు, సర్కార్,ఫణిసూరి, ఆర్ మ్ పి. వెంకట శేషయ్య, 'సాలిగ్రామం' మమత, శిరీష, విజయ, రేవతి తదితరులు నటించారు.
ఓటీటీలో సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్ర నిర్మాతలు కేవీ అమర్, సాంబశివరావు కూరపాటి, పూర్ణచంద్రరావు మాట్లాడుతూ... ''బిసినీట్ ద్వారా ఈ ఏడాది వినాయక చవితికి అన్ని ఓటీటీల్లో 'కన్యక'ను విడుదల చేస్తున్నామ''ని చెప్పారు.
'కన్యక' చిత్రానికి మాటలు: వెంకట్ .టి, పాటలు: విజయేంద్ర చేలో, గాయని: పూర్ణిమ, సంగీతం: అర్జున్, నేపథ్య సంగీతం: నరేన్, ఛాయాగ్రహణం: రాము- తరుణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: డీకే - బోయపాటి, నిర్మాతలు: కేవీ అమర్ - పూర్ణ చంద్ర రావు - సాంబశివరావు కూరపాటి, రచన-దర్శకత్వం: రాఘవేంద్ర తిరువాయి పాటి.