✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rakul Preet Singh: కొత్త దంపతులు జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్‌ కెమిస్ట్రీ చూశారా?

ABP Desam   |  23 Feb 2024 01:37 PM (IST)
1

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ఇటీవలే పెళ్లి చేసుకుని ఒకటైన సంగతి తెలిసిందే. వారు కొన్ని సంవత్సరాల నుంచే రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ వషు భగ్నానీ కుమారుడే రకుల్‌ను వివాహం చేసుకున్న ఈ జాకీ భగ్నానీ.

2

ఈ జోడి గత కొన్ని సంవత్సరాల నుంచి రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే విషయం బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరూ స్వయంగా రివీల్ చేసేదాకా ఈ రిలేషన్ షిప్ గురించి న్యూస్ బయటకు రాలేదు.

3

2009లో వచ్చిన ‘కల్ కిస్నే దేఖా’ సినిమాతో జాకీ భగ్నానీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా హీరోగా కొన్ని సినిమాల్లో నటించినా అవి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ప్రస్తుతం నిర్మాణం మీద దృష్టి పెట్టారు. త్వరలో విడుదల కానున్న బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టు ‘బడే మియా చోటే మియా’కు కూడా జాకీ భగ్నానీనే ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

4

తమిళ సినిమా ‘రాక్షసన్’ను హిందీలో ‘కట్‌పుట్లీ’ పేరుతో 2022లో రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను జాకీ భగ్నానీ నిర్మించారు. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

5

అప్పటి నుంచే వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. అగ్ర హీరోల సరసన నటించారు. 2009లో ‘గిల్లి’ అనే తమిళ సినిమాతో రకుల్ సినిమాల్లో అడుగుపెట్టారు. తెలుగులో ‘కెరటం’ ఆమె మొదటి సినిమా. 2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు.

6

ఆ తర్వాత ‘నాన్నకు ప్రేమతో’, ‘ధ్రువ’, ‘సరైనోడు’ సినిమాలతో టాప్ హీరోల బ్లాక్‌బస్టర్లలో భాగం అయ్యారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో శ్రీదేవి పాత్రలో కూడా రకుల్ కనిపించారు.

7

2022లో బాలీవుడ్‌లో రకుల్‌కు గోల్డెన్ ఇయర్ అని చెప్పవచ్చు. ఆమె నటించిన ఐదు సినిమాలు 2022లో రిలీజ్ అయ్యాయి. 2023లో కూడా రకుల్ నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

8

2021లో వచ్చిన ‘కొండపొలం’ తెలుగులో తన చివరి సినిమా. 2023లో ‘బూ’ అనే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల అయింది. ఈ సంవత్సరం ‘అయలాన్’తో తమిళ ప్రేక్షకులను పలకరించారు. క్రేజీ ప్రాజెక్టు ‘ఇండియన్ 2’లో కూడా రకుల్ నటిస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Rakul Preet Singh: కొత్త దంపతులు జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్‌ కెమిస్ట్రీ చూశారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.