Nayanthara: భర్త విగ్నేష్ శివన్ , పిల్లలతో నయనతార ఎంత హ్యాపీగా ఉందో.. అందుకే ధనుష్ పై అంత ఆగ్రహం!
భర్త పిల్లలతో..లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంత ఆనందంగా ఉందో ఈ ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది. ఇవి చిల్డ్రన్స్ డే సందర్భంగా తీసుకున్న ఫొటోస్... రెగ్యులర్ గా కూడా ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తుంటుంది నయనతార
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంచి భర్త, ముచ్చటైన పిల్లలు అంటూ తెగ మురిసిపోతుంది నయనతార. అందుకే విగ్నేష్ శివన్ ని పరిచయం చేసిన నేను రౌడీనే మూవీ అంటే ఆమెకు చాలా చాలా ప్రత్యేకం. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన క్లిప్స్, లిరిక్స్ విషయంలోనే నిర్మాత, కోలీవుడ్ హీరో ధనుష్ తో నయనతార వివాదం నడుస్తోంది.
చిన్న క్లిప్స్ వాడుకునేందుకు ధనుష్ పర్మిషన్ ఇవ్వలేదని.. మూడు సెకెన్లు తన పర్సనల్ కెమెరాతో తీసిన విజువల్స్ వాడినందుకు 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని లెటర్ రీలీజ్ చేసింది. ఈ లెటర్ కోలీవుడ్ లో వైరల్ అవుతోంది
తన ప్రేమ, పెళ్లి, పిల్లలు ఇలా తన జీవితంలో అందమైన క్షణానలను ఆ డాక్యుమెంటరీలో బంధించాలనుకుంది..ఇందుకోసం నేను రౌడీనే మూవీ క్లిప్స్ , లిరిక్స్ ఉపయోగపడతాయని భావించింది. ఇందుకు ధనుష్ నో చెప్పడంతో వివాదం రేగింది...
పాండిచ్చేరిలోని ఓ మారుమూల ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా..విజయ్ సేతుపతిపై సీన్స్ షూట్ చేస్తున్నారు. ఆ సమయంలో దూరం నుంచి విగ్నేష్ ని గమనిస్తున్నాను...దర్శకుడిగా తన ఓర్పు, ముఖంలో చెరగని చిరునవ్వు నన్ను కట్టిపడేశాయి..ఆ క్షణమే తనతో ప్రేమలో పడిపోయా అని చెప్పుకొచ్చింది నయన్..
నయన్-విగ్నేష్ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో కదూ...