Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ 'రాయల్ ఎఫైర్' - ట్రెడిషల్ లుక్‌లో మతిపోగోడుతున్న మారాఠి భామ
Mrunal Thakur Saree Photos: మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'సీతరామం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంది.
డెబ్యూ చిత్రంతోనే టాలీవుడ్‌లో సెన్సేషన్ అయ్యింది. ఇందులో మృణాల్ తన కట్టు, బోట్టుతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. తనదైన నటన.. అందం, అభినయంతో అందరిని దృష్టిని ఆకర్షించింది.
దీంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. సీతారామం తర్వాత 'హాయ్ నాన్న' చిత్రంలో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
అయితే రీసెంట్‌గా విడుదలైన ఫ్యామిలీ స్టార్‌లో మాత్రం అమ్మడికి ఆశించిన విజయం ఇవ్వలేకపోయింది. ఇందులో మృణాల్ నటనకు వందశాంత మార్కులు పడ్డాయి.
అలాగే విజయ్ దేవరకొండతో కెమిస్ట్రీ కూడా బాగానే పండిందని ఓ వర్గం ఆడియన్స్ మురిసిపోతుంటే మరికొందరు వీరిద్దరి ఆన్‌స్క్రీన్ రొమాన్స్ పెద్దగా ఆకట్టుకోలేదంటున్నారు. ఫ్యామిలీ స్టార్‌తో ఈ ఆమ్మడు తెలుగులో తొలి ఫ్లాప్ చూసింది.
ఇదిలా ఉంటే తరచూ మృణాల్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుందనే విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ శారీలో తళుక్కున మెరిసింది.
గోల్డ్ అండ్ క్రీం డిజైనర్ చీరకట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. వీటిని 'ఏ రాయల్ ఎఫైర్(a Royal Affair)' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక చీరలో మృణాల్ వయ్యారాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మరోసారి ట్రెడిషనల్ లుక్‌తో మతిపోగోడుతుంది భయ్యా అంటూ కుర్రకారు ఆమె ఫోటోలపై స్పందిస్తుంది. ప్రస్తుతం మృణాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.