✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Megastar Chiranjeevi : చిరు డైరెక్షన్ లో రాఘవేంద్రరావు.. కాంబో అదుర్స్ కదూ..

ABP Desam   |  01 Aug 2021 08:16 AM (IST)
1

వందకి పైగా సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తొలిసారి నటుడిగా మారనున్నారు. 'పెళ్లి సందD' సినిమాలో ఆయన వశిష్ట అనే పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్ గా ఆయన ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తూ చిన్న వీడియోను విడుదల చేశారు. ఇందులో రాఘవేంద్రరావుని స్టైలిష్ లుక్ లో చూపించి సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. 

2

శతాధిక చిత్రాల దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న రాఘవేంద్రరావు నటుడిగా మారుతున్నారని తెలిసి సెలబ్రిటీలంతా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు సోషల్ మీడియా వేదికగా రాఘవేంద్రరావుపై ప్రేమను కురిపించారు. అయితే రీసెంట్ గా చిరు, రాఘవేంద్రరావుల మధ్య ఓ ఫన్నీ సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. 

3

రాఘవేంద్రరావు ఫస్ట్ లుక్ చూసిన మెగాస్టార్ ఫ్యూచర్ లో ఆయనతో సినిమా చేయాలనుకున్నారట. ఇదే విషయాన్ని రాఘవేంద్రరావుకి చెబుతూ.. 'మిమ్మల్ని హీరోగా పెట్టి నేను సినిమా డైరెక్ట్ చేస్తా' అంటూ చిరు చెప్పగానే.. 'నాకు ఇప్పుడే వణుకు వచ్చేస్తుంది' అంటూ దర్శకేంద్రుడు బదులిచ్చారట. 

4

చిరంజీవి తన కెరీర్ లో రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ హీరోగా ఈ సినిమాకి సీక్వెల్ తీయమంటూ ఇప్పటికీ అభిమానులు అడుగుతూనే ఉంటారు. 

5

హీరోగా తనకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలిచ్చిన రాఘవేంద్రరావుని ఇప్పుడు చిరు డైరెక్ట్ చేయాలనుకోవడం విశేషం. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూద్దాం!

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Megastar Chiranjeevi : చిరు డైరెక్షన్ లో రాఘవేంద్రరావు.. కాంబో అదుర్స్ కదూ..
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.