Manjima Mohan Photos: నాగచైతన్య హీరోయిన్ ఈమె మీరు గుర్తుపట్టారా - పెళ్లయ్యాక లుక్ అదిరింది!
మలయాళ సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించింది. మలయాళంలో ఒరు వడక్కన్ సెల్ఫీ సినిమాతో, తమిళంలో అచ్చం ఎన్బదు మడమైయద మూవీతో అరంగేట్రం చేసింది. మంజిమా మోహన్ సాహసం శ్వాసగా సాగిపో మూవీతో తెలుగువారికి పరిచయమైంది.
మంజిమా మోహన్ కోలీవుడ్ యువ జంట గౌతమ్ కార్తిక్‌ను పెళ్లిచేసుకుంది. వీరిద్దరూ కలిసి 2019లో ‘దేవరత్తం’ అనే సినిమాలో కలసి నటించారు. అప్పటి నుంచి వీళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కడలి సినిమాతో 'కార్తీక్' తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
తెలుగులో నాగచైతన్యతో నటించిన సాహసం శ్వాసగా సాగిపో మూవీ డివైడ్ టాక్ రావడంతో ఆ తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు. ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది మంజిమ...
పెళ్లి ఫొటోల్లో తాను లావుగా ఉందంటూ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఈ విషయంపై చాలాకాలం బాధపడిన మంజిమ..ఆ తర్వాత ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. ఇప్పుడైతే ఫిట్ గా ఉంది మంజిమ. మంచి కథలు వస్తే నటించేందుకు సిద్ధం అంటోంది...
మంజిమామోహన్ Image credit: Manjima Mohan/Instagram