Varunlav Photos : ఆర్కిటిక్ సర్కిల్లో వరుణ్-లావణ్య.. మంచులో స్కేట్ చేస్తున్న కొత్తజంట

(Image Source: instagram/varunkonidela7)
టాలీవుడ్ కొత్త జంట ఆర్కిటిక్‌లో విహారం చేస్తుంది. వరుణ్, లావణ్య తమ వింటర్ వెకేషన్‌కి ఆర్కిటిక్ వెళ్లారు.
టాలీవుడ్ స్టార్ జంట వరుణ్‌తేజ్ లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఇటలీలోని టుస్కనీలో వివాహబంధంతో ఓ ఇంటివారయ్యారు. తొలి దీపావళి ఇండియాలో చేసుకున్నారు.
ప్రస్తుతం క్రిస్మస్ వెకేషన్ కోసం ఈ స్టార్ జంట విదేశాలకు వెళ్లింది. అక్కడ తమ మూమెంట్స్‌ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది ఈ జంట.
ఎన్నో ఏళ్లుగా తమ ప్రేమాయణం కొనసాగిస్తున్నా.. పెళ్లివరకు వచ్చేవరకు ఎక్కడా బహిర్గతం చేయకుండా జాగ్రత్త పడింది ఈ స్టార్ పెయిర్.
లావణ్య సినిమాలు, సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉంది. అందాల రాక్షసిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.
వరుణ్ కూడా తన పాత్రల ఎంపికలో రోటీన్‌కు భిన్నంగా ఎంచుకుంటూ హిట్స్ కొడుతున్నాడు. కొన్ని పరాజయాలైనా.. వాటిలోనూ కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు ఈ మెగా ప్రిన్స్.