Exit Poll 2024
(Source: Poll of Polls)
Ketika Sharma Viral Photos: బీచ్‌లో కేతిక శర్మ అందాల రచ్చ - మరి ఇంతలా హాట్ షో చేయాలా!
Ketika Sharma Beach Photos: కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పటి వరకు చేసింది నాలుగు సినిమాలే. ఇక కేతిక ఖాతాలో చెప్పుకొదగ్గ హిట్ లేకపోయినా ఈ అమ్మడికి క్రేజ్, ఫాలోయింగ్ మాత్రం భారీగానే ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవెండితెరపై పెద్దగా సందడి లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ అందాల ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ యువతకు నిద్రలేకుండ చేస్తుంది. హాట్ షోకు హద్దలు చేరిపేసి ఫుల్ గ్లామర్ డోస్ పెంచేస్తుంది.
తాజాగా రొమాంటిక్ బ్యూటీ బీచ్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫొటోలు చూసి యువత విలవిల్లాడుతుంది. ఈ ఫొటోల్లో కేతిక అందాల ఆరబోస్తు రచ్చ చేసింది. ఇంకేముంది నెటిజన్లు ఈ ఫొటోలపై తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ. అంతకు ముందు మోడలింగ్ చేసిన ఈ భామ, డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ కు జోడీగా నటించే అవకాశం అందుకుంది.
ఏ మాత్రం హద్దులు పెట్టుకోకుండా, లిప్ లాక్ కిస్సింగ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. అయితే ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినప్పటికీ అమ్మడి అందాల ఆరబోతకు యువ హృదయాలు దాసోహం అన్నాయి. నిజానికి 'రొమాంటిక్' రిలీజ్ అవ్వకముందే నాగ శౌర్య సరసన 'లక్ష్య' సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది కేతికా.
ఈ మూవీ కూడా ఆశించిన సక్సెస్ అందించలేకపోయింది. అలాంటి టైంలోనే యంగ్ బ్యూటీకి మెగా కాంపౌండ్ నుంచి పిలుపు వచ్చింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది.
అయితే ఈసారీ అమ్మడికి నిరాశే ఎదురైంది. మెగా మేనల్లుడి రొమాంటిక్ ఎంటర్టైనర్ డిజాస్టర్ గా మిగిలింది. ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కేతిక శర్మ, దురదృష్టవశాత్తూ హ్యాట్రిక్ డిజాస్టర్‌లు అందుకోవాల్సి వచ్చింది. వరుసగా మూడు ప్లాపులు పడటంతో అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి.