Keerthy Suresh : కీర్తి సురేశ్ దుబాయ్ వెకేషన్ ఫోటోలు.. లేటెస్ట్ పోస్ట్ చేసిన బ్యూటీ

కీర్తి సురేశ్ తన సోషల్ మీడియాలో లేటెస్ట్ పోస్ట్ చేసింది. తన దుబాయ్ ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. థ్రో బ్యాక్ ఫోటోలు అంటూ వాటికి క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/keerthysureshofficial)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
కిట్టి విత్ క్యూట్ బన్ అంటూ క్యూట్ క్యూట్ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ Kitty with a Kitty Bun! 🐱 Also, Duh! I am not scared of heights! 👀 #random #throwback #dubaidiaries క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/keerthysureshofficial)

కీర్తి సురేశ్ నటిగా మలయాళంలో తన సినీ కెరీర్ ప్రారంభించింది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా హిట్ అయినా ఈ సినిమాలో ఆమె నటన అంతంత మాత్రంగానే ఉందంటూ విమర్శలు వచ్చాయి. (Image Source : Instagram/keerthysureshofficial)
తర్వాత పలు తమిళ సినిమాల్లో నటించింది. నేను లోకల్ సినిమాతో తెలుగులో హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. (Image Source : Instagram/keerthysureshofficial)
అజ్ఞాతవాసి సినిమాలో నటించి మెప్పించింది. తరువాత మహానటి సినిమాతో నటిగా విజృంభించేసింది. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో జీవించేసింది. దాదాపు సౌత్‌లో అందరూ ఆమెకు అభిమానులుగా మారిపోయారు. (Image Source : Instagram/keerthysureshofficial)
ఈ సినిమాతో దేశవ్యాప్తంగా నటిగా మంచి గుర్తింపు తెచ్చింది. జాతీయ స్థాయిలో అవార్డు అందుకునేలా చేసింది. తర్వాత పలు లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. గత సంవత్సరంలో దసరా సినిమాతో మరోసారి తెలుగులో హిట్ కొట్టింది.(Image Source : Instagram/keerthysureshofficial)