Love Mocktail 2 Telugu Release: తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్ 'లవ్ మాక్‌టైల్ 2' - సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
'జాకీ', 'మధరంగి', 'రుద్రతాండవ', 'చార్లీ', 'లవ్ మాక్‌టైల్' సినిమాలతో కన్నడలో డార్లింగ్ కృష్ణ విజయాలు అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన సినిమా 'లవ్ మాక్‌టైల్' బ్లాక్ బస్టర్ అయ్యింది. దానికి సీక్వెల్ 'లవ్ మాక్‌టైల్ 2' చేశారు. ఇప్పుడు ఆ సినిమాను కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎంవిఆర్ కృష్ణ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'లవ్ మాక్‌టైల్ 2' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ 'ఎవరితో పయనం'ను లేటెస్టుగా విడుదల చేశారు. నకుల్ అభ్యంకర్ మంచి మ్యూజిక్ అందించగా... 'ఎవరితో పయనం' పాటను గురు చరణ్ రాశారు. యోగి సురేష్ పాడారు.
'ఎవరితో పయనం' పాట విడుదల సందర్భంగా నిర్మాత ఎంవిఆర్ కృష్ణ మాట్లాడుతూ... ''కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను వేసవి సెలవుల్లో తెలుగులో విడుదల చేయబోతున్నాం. 'డార్లింగ్' కృష్ణ కన్నడలో బ్లాక్ బస్టర్ హీరో. మంచి సినిమాలు చేశారు. ఆయన దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రమిది. 'ఎవరితో పయనం' పాటకు తెలుగులో కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. గతంలో శివ రాజ్ కుమార్ గారి 'వేద' తెలుగులో విడుదల చేశా. దాన్ని ఆడియన్స్ హిట్ చేశారు. ఆలాగే, 'లవ్ మాక్‌టైల్ 2'ను హిట్ చేయాలని కోరుతున్నా'' అని చెప్పారు.
డార్లింగ్ కృష్ణ హీరోగా నటించిన 'లవ్ మాక్‌టైల్ 2' సినిమాలో మిలినా నాగరాజ్, అమృత అయ్యంగార్, రచల్ డేవిడ్, నకుల్ అభ్యంకర్ ఇతర తారాగణం.
'లవ్ మాక్‌టైల్ 2' సినిమా స్టిల్స్
'లవ్ మాక్‌టైల్ 2' సినిమా స్టిల్స్