Actor Ali: నిర్మాతగా సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల - కొత్త బ్యానర్ లోగో విడుదల చేసిన అలీ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభమైంది. సీనియర్ జర్నలిస్టుగా ఎంతో మందికి సుపరిచితుడైన శివ మల్లాల నిర్మాతగా మారారు. 'శివమ్ మీడియా' పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. శివమ్ మీడియా సంస్థ లోగో ప్రముఖ నటులు అలీ చేతుల మీదుగా గురువారం విడుదల చేశారు. దర్శకులు ప్రవీణా కడియాల, అనిల్ కడియాల దంపతుల చేతుల మీదుగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ బ్యానర్ ఆవిష్కరించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశివమ్ మీడియా లోగో విడుదల చేసిన సందర్భంగా నటుడు అలీ మాట్లాడుతూ... ''నాకు శివ తమ్ముడు లాంటివాడు. వ్యక్తిగతంగా ఇరవై సంవత్సరాలుగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుండి కెరీర్ ప్రారంభించి ఈ రోజు నిర్మాతగా ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. బ్యానర్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉంది'' అని అన్నారు.
జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత, నటి ప్రవీణా కడియాల మాట్లాడుతూ... ''మా ముందు చిన్న విలేకరిగా, పిఆర్వోగా పని చేసిన మా శివాయేనా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిందని అనిపిస్తోంది. నిర్మాతగా శివ కొత్త జర్నీ స్టార్ట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. శివమ్ మీడియా విషయంలో నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ సంస్థలో డబ్బింగ్, స్ట్రెయిట్ అని తేడాల్లేకుండా మంచి సినిమాలు వస్తాయని, రావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
అనిల్ కడియాల మాట్లాడుతూ... ''శివ మల్లాల కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల నుంచి మాకు మంచి స్నేహితుడు. ఆయన మంచి మనిషి. మా ప్రయాణంలో శివ ఎప్పుడు ఉన్నాడు. శివమ్ మీడియా బ్యానర్ ద్వారా అనేక సినిమాలు తీసి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని అన్నారు.
శివమ్ మీడియా నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ... ''నాకు ఎప్పుడూ మద్దతుగా నిలిచే స్నేహితులు అలీ, అనిల్, ప్రవీణ. వీరి చేతుల మీదుగా నా నిర్మాణ సంస్థను ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉంది. నేను ఎంత కష్టపడతానో ఈ ముగ్గురికి బాగా తెలుసు. శివమ్ మీడియాలో మంచి సినిమాలు చేస్తా'' అని అన్నారు.
హమరేశ్, ప్రార్థన సందీప్ జంటగా శివమ్ మీడియా సంస్థలో శివ మల్లాల ప్రొడక్షన్ నంబర్ 1 స్టార్ట్ చేశారు. కె.యన్ విజయ్ మాటలు, రాంబాబు గోసాల పాటలు అందిస్తున్న ఆ సినిమాకు సుందరమూర్తి కె.యస్ సంగీత దర్శకుడు. వాలీ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే కథ అందించారు.