Janhvi Kapoor: 'గుడ్ లక్ జెర్రీ' ప్రమోషన్స్ లో జాన్వీ హాట్ లుక్!
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ 'దఢక్' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపరువు హత్యల కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ కి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఈ సినిమా తరువాత జాన్వీ నుంచి రెండు సినిమాలొచ్చాయి కానీ అవి ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.
పాండమిక్ సమయంలో ఆమె నటించిన 'గుంజన్ సక్సేనా', 'రూహీ' వంటి సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చాయి.
తాజాగా ఆమె నటిస్తోన్న మరో కొత్త సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తమిళంలో నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన 'కొలమావు కోకిల' సినిమాకి రీమేక్ గా బాలీవుడ్ లో 'గుడ్ లక్ జెర్రీ' అనే సినిమా తెరకెక్కుతోంది.
ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు.
జూలై 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది జాన్వీ.