Janhvi Kapoor : ముత్యాల డ్రెస్‌లో ముద్దుగా మెరిసిపోతున్న జాన్వీ కపూర్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. ముత్యాలతో రూపొందించిన డ్రెస్‌లో జాన్వీ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/janhvikapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముత్యాల బ్రెస్లెట్, ఉంగరాలు, చెవిరింగులతో అలంకరించుకుంది. హెయిర్‌ను చాలా స్టైలిష్‌గా సెట్ చేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/janhvikapoor)
లెజెండరీ హీరోయిన్ శ్రీదేవి, బోని కపూర్ కుమార్తెగా జాన్వీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ధడక్‌తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/janhvikapoor)
ధడక్, గుంజన్ సక్సేనా, రూహి, మిలీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్గా నటించింది. తన అందంతోనే కాకుండా నటనతో కూడా ఎందరో అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. (Images Source : Instagram/janhvikapoor)
ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాతో తెలుగు వెండితెరకి ఆరెంగేట్రం చేస్తోంది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా 'తంగం'అనే పాత్రలో కనిపించబోతోంది.(Images Source : Instagram/janhvikapoor)
బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మిశ్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘కర్ణ’. ఈ సినిమాలో తమిళ హీరో సూర్య నటిస్తుండగా.. హీరోయిన్గా జాన్వీ నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.(Images Source : Instagram/janhvikapoor)