Janhvi Kapoor Photos : కాఫీ విత్ కరణ్షోలో కపూర్ సిస్టర్స్.. షీకూ అంటూ బాయ్ ఫ్రెండ్ ముచ్చట్లు చెప్పిన జాన్వీ
జాన్వీ కపూర్ తన చెల్లెలు ఖుషి కపూర్‌తో కలిసి కాఫీ విత్ కరణ్ 8 షోకు హాజరైంది. ఖుషి కపూర్ ఈ షోకి మొదటిసారి వచ్చింది.
షోలో కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు ఈ కపూర్ సిస్టర్స్ ఫన్నీగా ఆన్సర్స్ ఇచ్చారు. ది ఆర్చీస్తో ఖుషి ఈ షోలో డెబ్యూగా అడుగు పెట్టింది.
చెల్లెలితో కలిసి జాన్వీ ఎంజాయ్ చేస్తూ షోలో తన ఇష్టాల గురించి తెలిపింది. తన బాయ్ ఫ్రెండ్ గురించి కూడా షోలో పలు విషయాలు తెలిపింది.
శిఖర్ పహ్రియా తన చెల్లి, తండ్రికి కూడా బాగా క్లోజ్ అని తెలిపింది. డేటింగ్ చేస్తున్నట్లు హింట్స్ ఇస్తూనే బెస్ట్‌ఫ్రెండ్ అంటూ కవర్ చేసింది.
ఇప్పటివరకు ముగ్గురిని డేట్ చేసినట్లు జాన్వీ తెలిపింది. అయితే ఇండస్ట్రీ నుంచి ఏ హీరోతో కూడా సీరియస్ రిలేషన్ పెట్టుకోనంటూ తేల్చి చెప్పింది.
తనను బాగా ఆరాధించే బయటి వ్యక్తి కావాలని.. ఒకే ఇండస్ట్రీకి చెందిన వారైతే తనకు బాగా స్ట్రెస్‌గా ఉంటుందని తెలిపింది.
కాఫీ విత్ కరణ్‌లో గిఫ్ట్ హ్యాంపర్ని కూడా ఈ భామ గెలుచుకుంది. ఇంతకముందు కూడా ఈ షోకి వచ్చినా ఇదే తొలిసారి హ్యాంపర్ గెలవడం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.