✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Telugu cinema: ఇప్పటివరకు తెరపై చూడని క్రేజీ కాంబినేషన్స్!

ABP Desam   |  07 Jul 2021 03:07 PM (IST)
1

ఒకప్పుడు టాలీవుడ్ హీరోలు, దర్శకులు తెలుగు భాషకు మాత్రమే పరిమితమయ్యేవారు. కానీ ఈ తరం ప్రేక్షకులు సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా చూసేస్తున్నారు. అందుకే హీరోలు కూడా ఇతర భాషల్లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో సరికొత్త కాంబినేషన్స్ పుట్టుకొస్తున్నాయి. అలా సెట్ అయిన క్రేజీ కాంబినేషన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం!

2

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' అనే సినిమా రాబోతుంది. 'కేజీఎఫ్' లాంటి సినిమా తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం, పైగా అందులో ప్రభాస్ నటిస్తుండడంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. 

3

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నారు. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ చేయబోయే సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా శంకర్-చరణ్ కాంబినేషన్ అనేసరికి బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం!

4

శేఖర్ కమ్ముల-ధనుష్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేయగానే.. కోలీవుడ్, టాలీవుడ్ లలో చర్చనీయాంశంగా మారింది. సెన్సిబుల్ స్టోరీలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల.. ధనుష్ లాంటి స్టార్ హీరోతో ఎలాంటి సినిమా తీస్తారో చూడాలి!

5

చాలా కాలంగా కోలీవుడ్ హీరో విజయ్ తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది. దీనికి వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి!

6

ప్రభాస్ తో 'సలార్' సినిమా పూర్తి చేసిన తరువాత ప్రశాంత్ నీల్ మరో హీరోని లాక్ చేశాడు. అతడు మరెవరో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎలివేషన్స్ తో పిచ్చెక్కించే ప్రశాంత్ నీల్ మన యంగ్ టైగర్ తో ఎలాంటి స్టోరీ తీస్తారో మరి!

7

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్ రాజా ఓ సినిమా చేయబోతున్నారు. మలయాళ సినిమా 'లూసిఫర్'కి ఇది రీమేక్. ఈ కాంబినేషన్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

8

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ తొలిసారిగా లింగుస్వామితో కలిసి పని చేయబోతున్నారు. మాస్ కమర్షియల్ సినిమాలు తీయడంతో లింగుస్వామి దిట్ట. మరి రామ్ లో ఉన్న మాస్ యాంగిల్ ను ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తారో చూడాలి. 

9

చాలా కాలంగా అల్లు అర్జున్ - మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని అంటున్నారు. రీసెంట్ గా మురుగదాస్ తన కథతో బన్నీని ఒప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా రానుంది. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Telugu cinema: ఇప్పటివరకు తెరపై చూడని క్రేజీ కాంబినేషన్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.