Amy Jackson Wedding: ఇటలీలో అమీ పెళ్లి - ఫ్లైట్‌లో కాబోయే భర్తకు ముద్దు ఇస్తూ...
అమీ జాక్సన్ బ్రిటన్ బ్యూటీ. అయితే, ఆవిడకు ఇండియాలో అభిమానులు ఉన్నారు. అందుకు కారణం సినిమాలు. తమిళ సినిమా 'మదరాసు పట్టణం'తో ఆవిడకు పాపులాటిటీ వచ్చింది. తర్వాత తెలుగులో రామ్ చరణ్ 'ఎవడు'లోనూ నటించింది. ఇంకొన్ని సినిమాలు చేసింది. ఇప్పుడీ భామ గురించి ప్రస్తావన ఎందుకు అంటే... ఆవిడ పెళ్లికి రెడీ అయ్యింది. (Image Courtesy: iamamyjackson / Instagram)
అమీ జాక్సన్ తొలుత హోటల్ వ్యాపారాలు ఉన్న జార్జ్ పనాయోటుతో డేటింగ్ చేసింది. అతడితో ఓ బిడ్డకు జన్మ ఇచ్చింది. అతడితో బ్రేకప్ తర్వాత 2022లో ఇంగ్లీష్ యాక్టర్ ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ మొదలైంది. (Image Courtesy: iamamyjackson / Instagram)
'లెట్స్ గెట్ మ్యారీడ్ బేబీ' అని అమీ జాక్సన్ శుక్రవారం సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది అమీ జాక్సన్. ఈ ఏడాది జనవరిలో అమీకి ఎడ్ ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. (Image Courtesy: iamamyjackson / Instagram)
ఇటలీకి ప్రయివేట్ జెట్ లో అమీ జాక్సన్, ఎడ్ కలిసి వెళ్లారు. ఈ ఫొటోలో అమీ కుమారుడిని కూడా చూడొచ్చు. (Image Courtesy: iamamyjackson / Instagram)