Hebah Patel: సిల్వర్ స్క్రీన్ పై టైమ్ బాలేకపోయినా సోషల్ మీడియాలో తగ్గేదే లే అంటోన్న హెబ్బా!
సోషల్ మీడియాతో ట్రెండ్ సెట్ చేస్తున్న బ్యూటీస్ లిస్టులో చేరింది హెబ్బా పటేల్. సినిమాల సంగతేమో కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటోంది. రెగ్యులర్ గా ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది.
రీసెంట్ గా హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీలో నటించిన హెబ్బా పటేల్..హిట్ అందుకోలేకపోయింది. ఆఫర్లు వస్తున్నాయి కానీ కెరీర్ టర్న్ చేసే ఛాన్స్ రావడం లేదని తెగ బాధపడిపోతోంది
కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హెబ్బా..ఫస్ట్ మూవీతోనే హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి కానీ ఆ రేంజ్ హిట్ మళ్లీ పడలేదు
ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీస్ యావరేజ్ పడినా హెబ్బాకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. స్పెషల్ సాంగ్స్ లో మెరిసినా అదృష్టం కలసిరాలేదు... అందుకే ఇలా సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తోంది...
హెబ్బాపటేల్ (image credit: Hebah Patel/Instagram)