Sreeleela Birthday: హ్యాపీ బర్త్ డే శ్రీలీల- డాక్టర్ TO యాక్టర్- టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..
తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతోంది క్యూట్ బ్యూటీ శ్రీలీల. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో కలిసి వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తోంది. Photo Credit: Sreeleela/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇవాళ శ్రీలీల పుట్టిన రోజు. 23 ఏండ్లు పూర్తి చేసుకుని 24వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. Photo Credit: Sreeleela/Instagram
శ్రీలీల అమెరికాలో పుట్టి, బెంగళూరులో పెరిగి, తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. Photo Credit: Sreeleela/Instagram
డాక్టర్ కావాలనుకున్న శ్రీలీల అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. కన్నడ సినిమా ‘కిస్’తో వెండితెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే చక్కటి నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత 'భరాతే' మరో మూవీలోనూ ఛాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. Photo Credit: Sreeleela/Instagram
కేవలం రెండు సినిమాలతో కన్నడ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల.. 'పెళ్లి సందD' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. Photo Credit: Sreeleela/Instagram
టాలీవుడ్ తొలి మూవీ పెద్దగా సక్సెస్ సాధించకపోయినా, అమ్మడు అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. Photo Credit: Sreeleela/Instagram
ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా శ్రీలలకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేదు. రవితేజ 'ధమాకా' సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. Photo Credit: Sreeleela/Instagram
‘ధమాకా’ తర్వాత 'గుంటూరు కారం', ‘ఆదికేశవ’ ‘స్కంధ’, ‘భగవంత్ కేసరి’ లాంటి సినిమాలు చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. Photo Credit: Sreeleela/Instagram
ప్రస్తుతం ఈమె చేతిలో సుమారు అర డజన్ కు పైగా సినిమాలున్నాయి. అందులో పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పాటు రవితేజ లేటెస్ట్ మూవీ కూడా ఉంది. Photo Credit: Sreeleela/Instagram
శ్రీలీల పుట్టిన రోజు కావడంతో సినిమా ప్రముఖులతో పాటు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు. Photo Credit: Sreeleela/Instagram