HBD Anushka Shetty: సూపర్‌తో మొదలై అందాల దేవసేనగా అలరించిన అనుష్క... హ్యాపీ బర్త్ డే స్వీటీ
సూపర్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన తుళు అందం అనుష్క శెట్టి అలియాస్ స్వీటీ శెట్టి. ఆమె నలభయ్యవ పుట్టినరోజు నేడు. 1980 నవంబర్ 7న జన్మించింది అనుష్క. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ఎన్నో మంచి సినిమాలు చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. సూపర్ తరువాత చేసిన విక్రమార్కుడు సినిమా ఆమెకు గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకునేలా చేసింది. (Image credit: Instagram)
అనుష్కను టాప్ హీరోయిన్ గా చేసిని సినిమా మాత్రం అరుంధతినే. 13 కోట్ల పెట్టుబడితో తీసిని ఈ సినిమా 68 కోట్లు వసూలు చేసింది. అనుష్కను తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టింది. (Image credit: Instagram)
మిర్చిలో అల్లరి మరదలిగా ఎంతో ఆకట్టుకుంది ఈ పొడుగు సుందరి. ప్రభాస్ హైట్ కు తగ్గ హీరోయిన్ అనిపించుకుంది. వీరిద్దరూ మంచి స్నేహితులుగా కూడా మారిపోయారు. (Image credit: Instagram)
ప్రయోగాలు చేయడంలో ముందుంటుంది అనుష్క. సైజ్ జీరో సినిమా కోసం ఏకంగా కిలోల కొద్దీ బరువు పెరిగింది. ఆ సినిమాలో ఆమెను చూసి అభిమానులంతా అవాక్కయ్యారు. తరువాత మళ్లీ బరువు తగ్గిపోయిందిలెండి. (Image credit: Instagram)
చారిత్రక కల్పిత కథ బాహుబలిలో దేవసేనగా తెలుగు ప్రేక్షకులే కాదు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.... ఇలా ఎంతో మంది సినీ అభిమానుల మనసుదోచుకుంది. బాహుబలి మొదటి పార్ట్ లో అనుష్క పాత్ర పెద్దగా ఏమీ లేనప్పటికీ, రెండో పార్ట్ లో మాత్రం కథంతా ఆమె చుట్టే తిరిగింది. అందాల దేవసేనగా ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతుంది అనుష్క. (Image credit: Twitter)
గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన రుద్రమదేవి సినిమా కూడా ఆమె కెరీర్ మంచి మైలురాయిగా నిలిచింది. అబ్బాయిగా, అమ్మాయిగా రెండు పాత్రల్లోనూ చాలా చక్కగా నటించింది. (Image credit: Instagram)
భాగమతిలో నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ గా, భాగమతిగా రెండు పాత్రలను ఎంతో విభిన్నంగా నటించి చూపించింది. (Image credit: Instagram)
ఇక నిశ్శబ్ధం... ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో అనుష్క మూగ అమ్మాయిగా నటించింది. మాటలు లేకపోయినా ముఖంలోనే హావభావాలతో ఎంతో చక్కగా నటించింది. ఈమె మరిన్ని సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కోరుకుందాం. (Image credit: Instagram)