Guppedantha manasu rajeev Photos: రిషిధార జీవితంలో ఉప్పెనగా మారబోతున్న రాజీవ్ గురించి ఈ విషయాలు తెలుసా!
గుప్పెడంత మనసు సీరియల్ లో ఇద్దరు విలన్లు. ఒకరు దేవయాని అయితే మరొకరు రాజీవ్. సీరియల్ ఆద్యంతం దేవయాని విలనిజం కొనసాగుతూఉంటే.. రాజీవ్ అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాడు. కానీ రాజీవ్ ఎంట్రీ ఇచ్చాడంటే వసుధారకి మూడినట్టే
సీరియల్ లో వసుధార అక్క మొగుడు రాజీవ్..భార్య చనిపోవడంతో వసుధారని పెళ్లిచేసుకునేందుకు స్కెచ్ వేస్తాడు. రాజీవ్ నుంచి తప్పించుకుని ఇంటి నుంచి బయటపడి చదువుకుంటుంది వసుధార. ప్రస్తుతం రిషితో ప్రేమలో మునిగితేలుతోన్న వసుధార త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా ఆ పెళ్లి చెడగొట్టేందుకు దేవయాని మళ్లీ రాజీవ్ ని రంగంలోకి దించింది..
రాజీవ్ అసలు పేరు గోపాల్ శ్యామ్. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని తన ఊరు. చిన్నప్పటి నుంచి డాన్స్, నటన పై మక్కువతో స్కూల్ లో ఉన్నప్పటి నుంచీ సాంస్కృతి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు.
తండ్రి ప్రోత్సాహంతో నటనవైపు వచ్చిన గోపాల్ శ్యామ్.. మొదట్లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. 'ఆహ్వానం' సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టాడు. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అక్క మొగుడు', 'లక్ష్మీ కళ్యాణం' సీరియల్స్ లో నటించాడు... ప్రస్తుతం గుప్పెడంతమనసు సీరియల్ లో వసుధార బావ రాజీవ్ గా మెప్పిస్తున్నాడు..
గుప్పెడంతమనసు రాజీవ్( గోపాల్ శ్యామ్)(Image Credit: Gopal Shyam/ Instagram)
గుప్పెడంతమనసు రాజీవ్( గోపాల్ శ్యామ్)(Image Credit: Gopal Shyam/ Instagram)
గుప్పెడంతమనసు రాజీవ్( గోపాల్ శ్యామ్)(Image Credit: Gopal Shyam/ Instagram)