Game On Movie: 'గేమ్ ఆన్' డిజిటల్ రైట్స్‌కు ఫ్యాన్సీ ఆఫర్... హ్యాపీగా ఉంది - హీరో గీతానంద్
''మా 'గేమ్ ఆన్' కథ చాలా కొత్తగా ఉంటుంది. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా చేయాలని ట్రై చేశాం. జీవితంలో అన్నీ కోల్పోయిన హీరో... లూజర్ నుంచి విన్నర్ గా ఎలా మారాడు? అనేది కథ. ఆ ప్రయాణంలో భాగంగా వచ్చే టాస్కులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి'' అని గీతానంద్ చెప్పారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App''దర్శకుడు దయానంద్ నా తమ్ముడు కావడంతో స్క్రిప్ట్ విషయంలో ఇద్దరం బాగా డిస్కస్ చేసుకున్నాం. మేమిద్దరం చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాం. తమ్ముడు స్టోరీ రాస్తే నేను యాక్ట్ చేసేవాడిని. లేదంటే నేను డైరెక్ట్ చేసేవాడిని. మా మధ్య బాండింగ్, సింక్ బాగా ఉంటాయి. ఈ సినిమాకు అది హెల్ప్ అయ్యింది. రియల్ టైం సైకలాజికల్ గేమ్ వరల్డ్ లోకి ప్రేక్షకులు వెళ్లేలా సినిమా తీశాం. యాక్షన్ సీక్వెనులు చాలా కొత్తగా ఉంటాయి'' అని గీతానంద్ చెప్పారు.
''ఈ సినిమాలో నాకు జంటగా నేహా సోలంకి నటించింది. మా మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది. ఆమెది కథలో కీలక పాత్ర. సీనియర్ ఆర్టిస్టులు మధుబాల, 'శుభలేఖ' సుధాకర్, ఆదిత్య మీనన్ నటించడంతో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. మధుబాల గారు ఇప్పటి వరకు కనిపించని కొత్త పాత్రలో కనిపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ క్రేజీగా ఉంటుంది. ప్రేక్షకులు ఎవరు ఊహించలేరనేంతగా కుదిరింది. ఆదిత్య మీనన్ గారు గ్రే షేడ్ రోల్ చేశారు. 'శుభలేఖ' సుధాకర్ గారు నాకు తాత పాత్రలో నటించారు'' అని గీతానంద్ వివరించారు.
''మా 'గేమ్ ఆన్' సినిమాకు నేపథ్య సంగీతం హైలైట్. సౌండ్ మిక్సింగ్ అంతా చెన్నైలో, ఏఆర్ రెహమాన్ గారి స్టూడియోలో చేయించాం. థియేటర్లో సౌండ్ పవర్ పాక్డ్ ఉంటుంది. టెక్నికల్ విషయాల్లోనూ కేర్ తీసుకున్నాం. నిర్మాత రవి కస్తూరి కూడా నా ఫ్రెండ్ కావడంతో... అతను, నేను, తమ్ముడు - ముగ్గురం చర్చించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళం. పాటలు, విజువల్స్, సౌండ్... కొత్తగా ఉంటాయి'' అని గీతానంద్ చెప్పారు.
''విడుదలకు నాలుగైదు రోజుల ముందు నుంచి ప్రీమియర్ షోలు వేస్తున్నాం. వాటికి మంచి స్పందన వస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు... వివిధ వయసుల వారికి షోలు వేయగా, అందరి దగ్గర నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచిభొట్ల గారు సినిమా చూసి ఎగ్జైట్ అయ్యారు. మా సినిమా విడుదలకు ముందు డిజిటల్ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్ రావడం చాలా ఆనందంగా ఉంది. సీక్వెల్ ప్లానింగ్ కూడా ఉంది. అయితే, ప్రేక్షకుల నుంచి రియాక్షన్ బట్టి అది ప్రకటిస్తాం'' అని గీతానంద్ చెప్పారు.
మూడు కొత్త కథలు విన్నానని, త్వరలో ఆయా సినిమాలను ప్రకటిస్తానని గీతానంద్ చెప్పారు.