Faria Abdullah Photos: సమ్మర్ కూల్ డ్రెస్ లో అదిరిపోయిన చిట్టి - కాస్త ఆగండయ్యా అంటూ ఫ్యాన్స్ కి క్యూట్ రిక్వెస్ట్
‘జాతిరత్నాలు’ మూవీతో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఫరియా అబ్దుల్లా ఫస్ట్ మూవీతోనే ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత రావణాసుర మూవీలో లాయర్ గా మెప్పించింది. లేటెస్ట్ గా అల్లరి నరేష్ మూవీలో నటించింది. తమిళ చిత్రం ‘వల్లి మయిల్’ లో కూడా నటిస్తోంది.
జాతి రత్నాలు మూవీలో ఫరియా అబ్దుల్లాను చూసిన తర్వాత ఆమె హైట్ మీద ఎన్ని మీమ్స్ వచ్చాయి. సినిమాల్లోకి రాకముందుకు ఫరియా అబ్దుల్లా మోడలింగ్ చేసింది... థియేటర్ ఆర్టిస్ట్ గా, యూట్యూబర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. తాజాగా పింక్ ఫ్రాక్ తో ఉన్న పిక్స్ షేర్ చేసిన ఫరియా సమ్మర్ స్పెషల్ అంటూ పోస్ట్ పెట్టింది
సిల్వర్ స్క్రీన్ కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ సందడి చేసే ఈ బ్యూటీ పోస్ట్ చేసే రీల్స్, వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. రీసెంట్ గా ఆమె బర్త్ డే అనుకుని ఫ్యాన్స్ అంతా వరుస పోస్టుల ద్వారా విశెష్ చెబుతున్నారు..వాటిపై స్పందించిన ఫరియా అందరకీ క్యూట్ రిక్వస్ట్ పెట్టింది
తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారందరకీ థ్యాంక్స్ చెప్పిన ఫరియా..ఈ విశెష్ మళ్లీ జూన్ 21న చెప్పండి అని పోస్ట్ పెట్టింది. అందుకే ఫరియా బర్త్ డే జూన్ 21న...
Image Credit:Faria Abdullah/ Instagram