Divi Vadthya :చిట్టి నడుము చూపిస్తూ కుర్రాళ్లని చిత్రహింసలు పెట్టేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ దివి
బిగ్ బాస్ బ్యూటీ దివి గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మోడల్ కా కెరీర్ ఆరంభించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షిలో చిన్న పాత్రలో మెరిసిన తర్వాత లైమ్ లైట్ లోకి వచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత బాగా పాపులర్ అయింది. అందంతో పాటూ ఆటపాటల్లోనూ ఇరగదీసింది. టైటిల్ గెలవకపోయినా స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మూవీస్ లో , వెబ్ సిరీస్ లలో ఆఫర్స్ అందుకుంది. రీసెంట్ గా లంబసింగి మూవీలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. బాలయ్య-బాబీ కాంబోలో వస్తోన్న మూవీలోనూ దివి ఛాన్స్ దక్కించుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి జిమ్ వేర్ తో పాటూ ట్రెడిషనల్ లుక్ లోనూ పిక్స్ షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా షేర్ చేసిన లంగాఓణీ ఫొటోస్ ఓ రేంజ్ లో ఉన్నాయి.
స్టార్ హీరోయిన్లకు పోటీనిచ్చే అందంతో అల్ట్రా స్టైలిష్ లుక్స్ తో ఫిదా చేస్తుంటోంది. రీసెంట్ ఫొటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కిర్రాక్ దివి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
దివి (Image Courtesy : actordivi / Instagram)
దివి (Image Courtesy : actordivi / Instagram)