అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు చేరుకున్న అట్లీ - భార్య, కొడుకుతో సహా!
భారతీయ బిలియనీర్ ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు గుజరాత్‌లోని జామ్ నగర్లో జరుగుతున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ, ఆయన భార్య ప్రియ, కొడుకుతో సహా ఈ వేడుకలకు హాజరయ్యారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముఖ్యంగా వీరి డ్రెస్సింగ్ కూడా హైలెట్‌గా నిలిచింది. అట్లీ పూర్తిగా బ్లాక్ డ్రస్సు ధరించగా, ప్రియ రెడ్ డ్రస్సులో వచ్చారు.
సినిమాల పరంగా కూడా అట్లీ ప్రస్తుతం పీక్ ఫాంలో ఉన్నాడు. 2013లో ‘రాజా రాణి’తో సక్సెస్‌ఫుల్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా, 2023 నాటికి బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్‌తో ‘జవాన్’తో ఇండస్ట్రీ హిట్ కొట్టే స్థాయికి ఎదిగాడు.
‘రాజా రాణి’ తర్వాత వరుసగా మూడు సినిమాలు తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో చేశారు. ఈ మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.
దీంతో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకున్న అట్లీ... ‘జవాన్’తో షారుక్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు.
ఆ తర్వాత షారుక్ ఖాన్, తమిళ హీరో విజయ్ కాంబినేషన్లో సినిమా కోసం స్క్రిప్టు తయారు చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ విజయ్ ఇకపై సినిమాలు చేయబోనని ప్రకటించాడు. దీంతో ఆ సినిమాకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే.