Drinker Sai - Actor Dharma: డ్రింకర్ సాయి... 2024 ఎండింగ్‌లో టాలీవుడ్‌కి వచ్చిన కొత్త హీరో... ధర్మ నటనకు ఆడియన్స్ క్లాప్స్
తాగుబోతుగా నటించడం అంత ఈజీ కాదు... యాక్టింగ్ మీద ఎంతో కమాండ్ ఉంటే తప్ప! 'డ్రింకర్ సాయి' సినిమాలో హీరోగా నటించిన ధర్మ తాగుబోతుగా చేసిన తీరుకు తెలుగు ఆడియన్స్ ఇంప్రెస్ అవుతున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో ధర్మ కథానాయకుడిగా నటించిన సినిమా 'డ్రింకర్ సాయి'. 'బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్'... అనేది క్యాప్షన్. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ధర్మ నటనకు మంచి పేరు వచ్చింది.
'డ్రింకర్ సాయి'గా హీరో ధర్మ నటన గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. కథ, క్యారెక్టర్‌కు తగ్గట్టుగా తాగుబోతుగా కనిపించిన తీరు ఆడియన్స్ అందరినీ కట్టిపడిస్తోంది.
నటనతో పాటు ధర్మ డ్యాన్స్ కూడా బాగా చేశారు. లవ్, ఎమోషన్స్, ఫైట్స్... ప్రతి విభాగంలో తన మార్క్ చూపించాడు. సినిమాలో ధర్మ ఇంట్రడక్షన్ చాలా మాసివ్ గా ఉంది. మాస్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. పాటల్లో డాన్స్ కూడా బాగా చేశాడు. టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో ధర్మ ఒకడు అవుతాడని కొందరు ఆడియన్స్ అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ అంతా ధర్మ చేసిన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ హైలైట్ అంటున్నారు.
ధర్మ లుక్స్ యంగ్ ఆడియన్స్, ముఖ్యంగా స్టైల్ ఫాలో అయ్యే యూత్‌ను చాలా బాగా ఆకట్టుకున్నాయి. అతను ఫిజిక్ కూడా బాగా మెయింటైన్ చేశాడు. అన్నిటి కంటే ధర్మ నటనలో ఈజ్ ఉంది. అలాగే, రియలిస్టిక్ అప్రోచ్ ఉంది. అందువల్ల, ఎక్కువ మందికి నచ్చాడు.
'డ్రింకర్ సాయి' సినిమాలోని సెకండాఫ్‌లో వచ్చే అనాథాశ్రమంలో చిన్న పిల్లాడితో భద్రం చేసే కామెడీ అందర్నీ నవ్వించింది. 'పుష్ప' ట్రాక్ కూడా క్లిక్ అయ్యింది. ఇక క్లైమాక్స్ మరో హైలైట్ అయ్యిందని టాక్. ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం మెచ్చేలా పతాక సన్నివేశాలు ఉన్నాయి.
హీరోగా ధర్మకు 'డ్రింకర్ సాయి' మొదటి సినిమా అయినప్పటికీ మంచి అనుభవం ఉన్న నటుడిలా చేశాడని, ఈ యంగ్ హీరోకి మంచి భవిష్యత్ ఉందని ఆడియన్స్ అంతా అంటున్నారని దర్శకుడు కిరణ్ తిరుమల శెట్టి సంతోషం వ్యక్తం చేశారు.